Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ను విజయవంతం చేయటం ప్రతి పౌరుడి బాద్యత: ఆంధ్రప్రదేశ్ గవర్నర్

‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ను విజయవంతం చేయటం ప్రతి పౌరుడి బాద్యత: ఆంధ్రప్రదేశ్ గవర్నర్
, శుక్రవారం, 12 మార్చి 2021 (19:17 IST)
భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి 75 సంవత్సరాలు అవుతున్న శుభతరుణంలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ప్రారంభించిన ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ వేడుకలలో పాల్గొని విజయవంతం చేయటం ప్రతి పౌరుని బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు.
 
2022 ఆగస్టు 15కు 75 వారాల ముందస్తుగా మార్చి 12న 'ఆజాది కా అమృత్ మహోత్సవ్' ప్రారంభించబడిందని గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. 1930లో మహాత్మా గాంధీ నేతృత్వంలోని చారిత్రాత్మక ఉప్పు సత్యాగ్రహ దండి యాత్ర ప్రారంభమైందని దాని 91వ వార్షికోత్సవం కూడా ఈ సంవత్సరమేనని గుర్తు చేసారు.
 
స్వాతంత్ర్య పోరాటం, ఉద్యమం అనే అంశంపై ప్రదర్శనలు, పోటీలు, విద్యార్థుల ర్యాలీలు, సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా విద్యార్థి సంఘాలు చురుకుగా కార్యక్రమాలలో పాల్గొని 75వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గుర్తు చేసుకోవాలన్నారు. ఏడాది పొడవునా జరిగే ‘ఆజాది కా అమృత్ మహోత్సవ్’ వేడుకల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులను, వారి కుటుంబ సభ్యులను సత్కరించాలని గవర్నర్ శ్రీ హరిచందన్ పిలుపునిచ్చారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సురక్షితమైన రేపటి కోసం దేశాన్ని ఏకం చేసే ఉద్యమం ఐ వాంట్‌ మై పింక్‌ బెల్ట్‌