Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఈ-పాస్ యంత్రాలు... ఇక నగదు రహిత ప్రయాణాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) వినూత్న ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా నగదు రహిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరెన్సీ నోట్లతో పాటు చిల్ల

ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఈ-పాస్ యంత్రాలు... ఇక నగదు రహిత ప్రయాణాలు
, గురువారం, 24 నవంబరు 2016 (11:35 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) వినూత్న ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ఇందులోభాగంగా నగదు రహిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరెన్సీ నోట్లతో పాటు చిల్లర సమస్యను తీర్చేందుకు వీలుగా.. ఈ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలోని పలు బస్టాండ్లలో ఈ-పాస్ యంత్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. పలు బస్టాండ్లలోని రిజర్వేషన్ కార్యాలయాలతో పాటు, నాన్‌స్టాప్ బస్ సర్వీసు కౌంటర్ల వద్ద ఈ యంత్రాలను వినియోగిస్తున్నారు. టికెట్లు కావాల్సిన వారు చిల్లర గురించి చూసుకోనవసరం లేకుండా ఈ-పాస్ యంత్రాల్లో తమ డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను స్వైప్ చేసి, పిన్ నంబర్‌ను ఎంటర్ చేయడం ద్వారా టికెట్‌ను తీసుకుని ప్రయాణం చేసే వెసులుబాటును కల్పించింది. 
 
నగదు రహిత ప్రయాణాలను ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ, త్వరలో దూరప్రాంత బస్ డ్రైవర్లకు కూడా ఈ-పాస్ యంత్రాలను అందించనున్నట్టు తెలిపారు. ప్రజలకు కష్టం కలుగకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. సెర్ప్, మెప్మా అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన, అన్ని ఈ-పాస్ యంత్రాలనూ ఆర్టీసీకి వినియోగించాలని సూచించారు. 
 
కాగా, విజయవాడ బస్టాండ్‌లో ఈ-పాస్ యంత్రాలను మంత్రి శిద్ధా రాఘవరావు, ఆర్టీసీ ఎండీలు ప్రారంభించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 50 మెషీన్లను అందుబాటులో ఉంచామని ఈ సందర్భంగా శిద్ధా వెల్లడించారు. మరో వారం రోజుల్లో అన్ని రిజర్వేషన్ కార్యాలయాలకూ మెషీన్లను అందిస్తామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎయిర్‌టెల్ ఫ్రీ వాయిస్ కాల్ ఆఫర్.. రూ.2249 చెల్లించాలట... ఇదేం ఆఫరోనంటూ పెదవి విరుపు