రాష్ట్రంలోని పాఠశాలల్లో బుధవారం జరిగిన పేరెంట్స్ కమిటీ ఎన్నికల వివరాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
మొత్తం 46,609 పాఠశాలలకు గాను 44, 237 పాఠశాలల్లో అంటే 94.91 శాతం పాఠశాలల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగింది. అందులో 19 వేల పాఠశాలల్లో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
వివిధ కారణాలతో కేవలం 5 శాతం 2, 372 పాఠశాలల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. వెంటనే వాటిని కూడా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించటం జరిగింది.
ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. అలాగే పాఠశాలల అభివృద్ధి లో కూడా నూతన కమిటీ సభ్యులు భాగస్వాములు కావాలి.