ఎలక్ట్రిక్ వాహనాలపై దేశ వ్యాప్త చర్చ మొదలైంది. ఇది ఎంత వరకు సేఫ్ అన్న టాక్ నడుస్తోంది. అసలు ఈ మధ్య కాలంలో ఎలక్ట్రిక్ బైక్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ధ్వని, వాయు కాలుష్యనియంత్రణకు ఈ-వాహనాలను ప్రొత్సహిస్తున్న క్రమంలో ఎలక్ట్రిక్ బైకుల్లో మంటలు రావడం, బ్యాటరీలు పేలడం కలకలం రేపుతున్నాయి. చాలా మంది మృతికి కారణమవుతున్నాయి.
ఇటీవల నిజామాబాద్‌లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందున్నారు.
వేసవిలో ఎండల కారణంగా బ్యాటరీలు వేడెక్కడంతో ఎలక్ట్రిక్ వాహనాలు పేలిపోతున్నాయి. తాజాగా విజయవాడలోనూ ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. విజయవాడ సూర్యారావు పేటలోని గులాబీ తోటలో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.
40 శాతం గాయాలు కావడంతో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు చిన్నారులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఉపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో వాళ్ల పరిస్థితి కూడా విషమంగానే వున్నట్లు తెలుస్తోంది.