Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీలో మరో ఇద్దరు ఐపీఎస్‌లపై వేటు పడింది.. ఈసీ ఆదేశాలు

andhra pradesh map

వరుణ్

, గురువారం, 25 ఏప్రియల్ 2024 (08:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా మే 13వ తేదీన జరుగనుంది. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని పార్టీల నేతలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి అనుచరణగణం ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అయితే, అధికార పార్టీకి, ఆ పార్టీ నేతలకు అంటకాగుతున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపిస్తుంది. ఇప్పటికే ఆరు జిల్లాల కలెక్టర్లు, ఎప్సీలపై వేటు వేసిన ఎన్నికల సంఘం తాజాగ మరో ఇద్దరు ఐపీఎస్‌లపై చర్యలు తీసుకుంది. వీరిలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామ ఆంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణాలు ఉన్నారు. వీరిద్దరిని ఎన్నికలు ముగింసేంతవరకు ఎన్నికల విధులకు దూరంగా ఉంచుతూ ఆదేశాలు జారీచేసింది. 
 
అలాగే వారిస్థానంలో కొత్త నియామకాలు చేపట్టింది. ఏపీ స్టేట్ కొత్త ఇంటెలిజెన్స్ చీఫ్‌గా కుమార్ విశ్వజిత్, విజయవాడ పోలీస్ కమిషనర్‌గా పి.హెచ్.డి. రామకృష్ణను నియమిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిద్దరూ ఏప్రిల్ 25వ తేదీన గురువారం మధ్యాహ్నం 11 గంటలలోపు బాధ్యతలు చేపట్టాలని ఆదేశించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోదాడలో ఘోరం.. ఆగివున్న కారును ఢీకొట్టిన కారు.. ఆరుగురు దుర్మరణం!!