Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుపతిలో హాకీ క్రీడా అభివృద్ధికి కృషి: ఎంపి గురుమూర్తి

తిరుపతిలో హాకీ క్రీడా అభివృద్ధికి కృషి: ఎంపి గురుమూర్తి
, శుక్రవారం, 20 ఆగస్టు 2021 (21:07 IST)
తిరుపతిలో హాకీ క్రీడా అభివృద్ధి కి అన్ని రకాల తోడ్పాటు అందిస్తామని తిరుపతి పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి వెల్లడించారు. ఆయన శుక్రవారం తన కార్యాలయంలో ఒలింపిక్స్ లో భారత్ హాకీ జట్టు కి ప్రాతినిధ్యం వహించిన రజనీని ఘనంగా సన్మానించారు.

శాలువా కప్పి మొక్కను బహుకరించారు. ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ... తిరుపతి నగరంలో హాకీ క్రీడ అభివృద్ధికి, మౌళిక సదుపాయాలు కల్పనకు పార్లమెంట్ సభ్యునిగా తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు.

ఇప్పటికే తిరుపతి క్రీడ పరంగా ఉన్నతంగా అబివృద్ది చేసేందుకు ప్రియతమ ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగా మహిళ వర్సిటీలో ప్రత్యేక క్రీడా కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయన్నారు.

అలాగే యువ క్రీడాకారులు రజని వంటి దేశం గర్వించదగ్గ క్రీడాకారుల ను స్ఫూర్తి గా తీసుకుని ఒక లక్ష్యం తో క్రీడాలు సాధన చేయాలన్నారు.

అనంతరం సన్మాన గ్రహిత రజని మాట్లాడుతూ... ఒలింపిక్స్ నుంచి వచ్చాక ఇది వరకే సీఎం వైస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసానని, సిఎం ఆర్థికంగా సాయం చేయటంతో పాటు అన్ని రకాలుగా హాకీ క్రీడను అభివృద్ధి చేస్తామని చెప్పారన్నారు. ఇప్పుడు మన తిరుపతి యమ్ పి గురుమూర్తి క్రీడల అభివృద్ధి కి సహకరిస్తామని చెప్పటం చాలా ఆనందం కలిగించిందని తెలిపారు.

భారత్  మహిళ హాకీ జట్టు మొదటి సారి ఒలింపిక్స్ లో మొదటిసారి నాల్గవస్థానం సాధించింది అన్నారు.  మెడల్ తృటిలో మిస్ అయినా, మన దేశ ప్రజలు మనసు గెల్చుకోవటం భవిష్యత్తు క్రీడా పోటీల్లో  ఇంకా అంకిత భావంతో దేశం కోసం అడతామన్నారు. ఈ కార్యక్రమంలో సెట్విన్  సీఈ ఓ మురళి క్రిష్ణా రెడ్డి , హాకీ కోచ్ ప్రసన్న కుమార్ పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28 నుంచి సాగర్ - శ్రీశైలానికి లాంచీ యాత్ర