Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఈ నెల 16న పశ్చిమ గోదావరి జిల్లాలో విద్యాకానుక: జ‌గ‌న్

Advertiesment
Jagananna Vidya Kanuka
, గురువారం, 5 ఆగస్టు 2021 (09:15 IST)
స్కూళ్లలో విద్యార్థుల నిష్పత్తికి తగినట్లుగా టీచర్లను ఉంచాలని, టీచర్ల అనుభవం, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. స్కూళ్ల వర్గీకరణకు తగినట్టుగా టీచర్లను పెట్టాలని, విద్యార్థుల నిష్పత్తికి తగినట్టుగా టీచర్లను ఉంచాలని అధికారులను ఆదేశించారు.

టీచర్లకున్న అనుభవాన్ని, బోధనలో వారికున్న నైపుణ్యాన్ని వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. ఈనెల 16న పశ్చిమగోదావరి జిల్లాలో విద్యా కానుక ప్రారంభం కానుందని తెలిపారు. 

3వ తరగతి నుంచి నిపుణులైన టీచర్ల ద్వారా విద్యాబోధన జరగాలని తెలిపారు. ప్రపంచస్థాయి పోటీకి తగినట్లుగా విద్యార్థులు తయారవుతారని చెప్పారు. ఇంగ్లిష్‌ మీడియంలో బోధన అందుతుందని, తెలుగును తప్పనిసరి సబ్జెక్ట్‌గా బోధించాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. నూతన విద్యావిధానం, నాడు-నేడు కోసం రూ.16 వేలకోట్ల ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 

నూతన విద్యా విధానంపై అందరిలోనూ అవగాహన తేవాలని, నూతన విద్యా విధానం ఉద్దేశాలను వివరంగా తెలియజేయాలని జగన్‌ అధికారులకు సూచించారు. కలెక్టర్లు, జేసీలు, డీఈవోలు, పీడీలకు అవగాహన కల్పించాలన్నారు. అమ్మఒడి, ఇంగ్లిష్‌ మీడియం, నాడు-నేడు వల్ల క్షేత్రస్థాయిలో గణనీయమైన ఫలితాలు వస్తున్నాయని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారతీయ ప్రవాసులుకు తీపికబురు.. !