ఎంసెట్ 2014 పరీక్ష ఫలితాలను తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సోమవారం విడుదల చేశారు. ఈ పరీక్షకు మొత్తం 2,66,820 మంది విద్యార్థులు హాజరు కాగా, వీరిలో 1,88,831 మంది అర్హత సాధించారని ఆయన వెల్లడించారు. ఎంసెట్ లో 70.77 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థుల సెల్ ఫోన్లకు సంక్షిప్త సందేశాల (ఎస్ఎంఎస్) ద్వారా ర్యాంకులను వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు.
కాగా, ఎంసెట్‌లో ఇంజినీరింగ్ విభాగంలో ఫస్ట్ ర్యాంక్ నందిగం పవన్ కుమార్ సాధించారు. 99.2 శాతంతో, 158 మార్కులతో పవన్ తొలి స్థానంలో నిలిచాడు. రెండో ర్యాంకు చాణక్యవర్థన్ రెడ్డి (98.5), నిఖిల్ కుమార్ (98.4), 157 మార్కులతో మూడో స్థానంలో నిలిచాడు.
అదేవిధంగా ఎంసెట్ మెడికల్ విభాగంలో గుర్రం సాయి శ్రీనివాస్ ఫస్ట్ ర్యాంక్ సాధించారు. 99.45 శాతంతో, 159 మార్కులతో సాయి శ్రీనివాస్ తొలి స్థానాన్ని చేజిక్కించుకోగా, రెండో ర్యాంక్ బి. దివ్య (99.45), 159 మార్కులు, కందికొండ పృధ్వీరాజ్ (98.84) 159 మార్కులతో మూడో ర్యాంక్ సాధించినట్టు మంత్రి వివరించారు.