Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రబాబు లాంటి నేత మరొకరు లేరు.. ఇక జన్మించబోరు : డిప్యూటీ సీఎం కేఈ

Advertiesment
dy cm ke krishnamurthy
, బుధవారం, 25 మే 2016 (13:06 IST)
టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబులాంటి నేత రాష్ట్రంలో మరొకరు లేరనీ, ఇకపై పుట్టబోరన్నారు. 
 
విజయవాడలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్రానికి నాయకత్వం వహించగల సమర్థమైన వ్యక్తి చంద్రబాబు ఒక్కరే అని ప్రజలు భావిస్తున్నారన్నారు. 
 
రాష్ట్ర సమస్యలపై అవగాహన లేని కొన్ని పార్టీలు చంద్రబాబుపై అనవసర విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రిపై పదేపదే విమర్శలు చేయడం వారికి రివాజుగా మారిపోయిందన్నారు. 
 
అభివృద్ధి విషయంలో జిల్లా కలెక్టర్లు పోటీతత్వంతో పనిచేయాలన్నారు. అని అభివృద్ధిలో మండలాలు ఎక్కడ బలంగా ఉన్నాయి... ఎక్కడ బలహీనంగా ఉన్నాయో కలెక్టర్లు గుర్తించాలని కోరారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవ్యాంధ్ర రెండేళ్ళ పసిపాప.. నంబర్ 1 స్థానంలో నిలబెడుదాం : చంద్రబాబు