Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజధానిపై వేడేక్కుతున్న రాజకీయం.. రైతులపై లాఠీచార్జ్

రాజధానిపై వేడేక్కుతున్న రాజకీయం.. రైతులపై లాఠీచార్జ్
, సోమవారం, 26 ఆగస్టు 2019 (16:17 IST)
గుంటూరు జిల్లా తూళ్ళురు మండలం లోని గ్రామాలు, మంగళగిరి, తాడేపల్లి మండలంలోని పలు గ్రామాలను రాజధాని పేరుతో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ల్యాండ్ ఫూలింగ్‌కు తీసుకుని రాజధాని నిర్మాణానికి చేపట్టారు. అప్పటిలో కొన్ని గ్రామాల నుంచి వ్యతిరేకత వచ్చిన కొన్ని రోజుల తర్వాత చల్లబడింది. కానీ మరీ కొంత మంది మాత్రం తమకు అన్యాయం జరుగుతుందని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అప్పుడు వారికి వామపక్ష పార్టీలు, అప్పటి ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అన్ని దేశ, రాష్ట్రా రాజకీయ పార్టీలు రైతులకు అండగా నిలిచాయి. 
 
ఈ క్రమంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం రైతులు నుంచి నయానో బయానో భూములు తీసుకోవటంలో ఒకింత సఫలీకృతమయ్యారు. తర్వాత కూడా కొంత వ్యతిరేకత వస్తున్న వాటిని పరిగణనలోకి తీసుకోకుండానే ముందుకు సాగింది. అయితే నూతన ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి స్థానిక రాజధాని ప్రాంతంలో ప్రజలకు ఓ పెద్ద సమస్య, అనుమానం రాష్ట్ర రాజధాని ఇక్కడ నుండి తరలిస్తారు అనే అపోహ. దీనిపై తొలి రోజులలో ఒకింత క్లారిటీ వైసీపీ నేతలు ఇచ్చిన ఆ అనుమానం అలాగే వస్తువచ్చింది.
 
అయితే ప్రస్తుతం రాజధాని నగరంపై నిలినీడలు అలుముకునేలా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల ఉన్నాయి. గతంలో ఇక్కడ కొందరు ప్రజల అనుమానం నిజంగానే అనేలా బొత్స వ్యాఖ్య, దీనికితోడు దొనకొండపై ఉపందుకున్న రియల్ భూమ్ వీటన్నింటికి ఉతమిస్తోందని రాజకీయ విశ్లేషకులు, తలపండిన నేతలు, పలువురు మేధావులు తరచూ ఆరోపణలు చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్ చేసిన వ్యాఖ్యల మరింతగా ఆందోళన చెందేలా ఉన్నాయి. అధికార పార్టీ సీనియర్ మంత్రి ఇలా అనటం దానికి ఉతంగా బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు రాజధాని ప్రాంతంపై మరింత ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు. దీంతో రాజధాని ప్రాంతంలో పలు గ్రామాల ప్రజలు రోడ్లపై తమ నిరసన ప్రదర్శనలు ప్రారంభించారు. 
 
ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రాజధాని ప్రాంతంలో ప్రజలకు ఇది నిజంగా ఓ అవక్కవక తప్పదు అనేలా చేశారు. గత ప్రభుత్వంలో భూములు ఇవ్వడానికి ఇష్టం లేని వారిపై పోలీసులతో చూపించిన ప్రేమ ఈ ప్రభుత్వంలో తరలించేందుకు ఒప్పుకొని రైతులపై చూపిస్తూన్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

45మంది మైనర్ బాలికలపై అత్యాచారం.. పాకిస్థానీ దంపతుల అరెస్ట్