Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చేసేది హోంగార్డు ఉద్యోగం... నడిపేది వ్యభిచార గృహం

Advertiesment
చేసేది హోంగార్డు ఉద్యోగం... నడిపేది వ్యభిచార గృహం
, శనివారం, 25 జులై 2020 (18:22 IST)
అతడి పేరు షఫీ.. పగలంతా హోంగార్డు ఉద్యోగం చేస్తాడు. రాత్రి మాత్రం వ్యభిచార గృహం నడుపుతుంటాడు. అనుమానం వచ్చిన చుట్టుప్రక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. ఇంకేముంది, పోలీసులు రంగంలోకి దిగి హోంగార్డుతో పాటు విటులను అదుపులోనికి తీసుకున్నారు.
 
వివరాల్లోకి వెళితే షఫీ అనే వ్యక్తి నెల్లూరులో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. కోవూరు ప్రభుత్వ వైద్యశాల వెనుక మూడు పడకల గదులు ఉండే ఓ నివాసాన్ని అద్దెకు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా అక్కడే వ్యభిచార కార్యకలాపాలను నడిపిస్తున్నాడు. బయట ప్రాంతాల నుండి యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తూ డబ్బు సంపాదించేవాడు.
 
ఆ ఇంటికి నిత్యం విటులు వస్తూ పోతూ ఉండగా కొంతమందికి అనుమానం వచ్చి కోవూరు పోలీసులకు సమాచారం  అందించారు. శుక్రవారం రాత్రి పోలీసులు ఆ ఇంటిపై రైడ్ చేయగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్న హోంగార్డు షఫి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. అలాగే అక్కడున్న ఇద్దరు యువతులతో పాటూ ఇద్దరు విటులను కూడా అదుపులోకి తీసుకున్నారు. 
 
పడక గదులను పోలీసులు తనిఖీ చేయగా ఏ గదిలో చూసిన కండోమ్ ప్యాకెట్లు, పేక ముక్కలే దర్శనమిచ్చాయి. పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. మరోవైపు హోం గార్డుగా ఉంటూ వ్యభిచార గృహం నిర్వహిస్తున్న షఫిని ఈ కేసు నుండి తప్పించేందుకు ఓ పార్టీకి చెందిన ఓ మాజీ కార్పొరేటర్, ఓ సీఐ ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"ప్రజలందరూ బాగుండాలనే చాతుర్మాస్య దీక్ష" : పవన్ కళ్యాణ్