తుంగభద్ర పుష్కరాల్లో అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక కుళాయి ద్వారా నీళ్లు చల్లుకోమని ప్రభుత్వం కోరడం విడ్డురంగా ఉందని భాజాపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు ఆక్షేపించారు.
కనీసం నీటి కుళాయిలద్వారా స్నానాలకు అవకాశం కల్పించి ఆ నీటిని తిరిగి నదిలోకి వెళ్ళకుండా సానిటరీ అధికారులు చర్యలు తీసుకోవాలి.
భక్తులకు అసౌకర్యం కలగకుండా సహకరించాలి. కోట్లాది రూపాయలు ప్రజాధనం వెచ్చించి ప్రభుత్వం పుష్కర ఏర్పాట్లు, సౌకర్యాల విషయంలోకూడ ప్రజా ఆరోగ్యానికి హాని కలుగకుండా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజల ఆరోగ్యంనకు
హనికలగకుండా ప్రజలకు సహకరిచాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.
భక్తుల స్నానాల సమయంలో తీసుకోవలసిన జగర్తలు, ఆచరించాల్సిన చర్యలవిషయంలో ప్రభుత్వ అధికారులుకు సహకరించి స్నానమాచరించాలని భక్తులను వీర్రాజు కోరారు.