Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంటిదీపాలను ఆర్పేసి పరిహారం చెల్లిస్తారా.. ప్రభుత్వం పెట్టకపోతే జేసీ బ్రదర్స్‌పై మేమే కేసులు పెడతాం

‘మా పిల్లలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారని ఎంతో సంబరపడ్డాం. కానీ బస్సు ప్రమాదం మా పిల్లలిద్దర్నీ బలితీసుకుంది. డ్రైవర్‌ నిర్లక్ష్యం మా పిల్లలను కానరాని లోకాలకు పంపింది. ప్రైవేట్‌ బస్సులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా ప్రభు త్వాలు పట్టించుకోకపోవడం దా

Advertiesment
Diwakar travels
హైదరాబాద్ , సోమవారం, 6 మార్చి 2017 (05:34 IST)
‘మా పిల్లలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారని ఎంతో సంబరపడ్డాం. కానీ బస్సు ప్రమాదం మా పిల్లలిద్దర్నీ బలితీసుకుంది. డ్రైవర్‌ నిర్లక్ష్యం మా పిల్లలను కానరాని లోకాలకు పంపింది. ప్రైవేట్‌ బస్సులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా ప్రభు త్వాలు పట్టించుకోకపోవడం దారుణం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పి ఆధార్‌కార్డులు, బ్యాంకు అకౌంట్లు తీసుకెళ్లారు. ఎవరెంత పరిహారం చెల్లించినా మా పిల్లల ప్రాణాలు మాకు తిరిగి ఇవ్వగలరా మా పిల్లల చావుకు కారణమైన బస్సు యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదు. అంటూ కృష్ణా జిల్లా నంది గామ వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన నలబోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డిల తల్లిదండ్రులు శేషిరెడ్డి, కమలమ్మ కన్నీటి పర్యంతమయ్యారు.  ‘మాయదారి దివాకర్‌ బస్సే మా ఇంటి దీపాలను ఆర్పేసింది..’ అంటూ ఆదివారం సూర్యాపేట జిల్లా కోదండరాంపురంలో వారు మీడియాతో మాట్లాడారు. మా పిల్లల ప్రాణాలను బలిగొన్న బస్సు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 
హైదరాబాద్‌ రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు పెట్టడం సరికాదని ఆ ప్రమాదంలో మరణించిన హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ తయ్యబ్‌ భార్య రషీదా బేగం అన్నారు. ఆదివారమిక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదానికి కారణమైన దివాకర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తుంది తప్ప బాధితులను పట్టించుకోవడం లేదని మండి పడ్డారు. ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే దివాకర్‌ ట్రావెల్స్‌ యజమానులైన జేసీ సోదరులపై తామే కేసు పెడతామన్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వీళ్లు ఫ్రెండ్లీ పోలీసులట.. వీళ్లకంటే దున్నపోతులు నయం కాదా?