Duvvada srinivas divvala Madhuri
వైసీపీ విధానాలపై దివ్వెల మాధురి ఫైర్ అయ్యారు. వైకాపా విధానాలు లీడర్, లీడర్‌కు మారుతుందా అని ప్రశ్నించారు. వైకాపా గాలి పార్టీ అని దివ్వెల మాధురి ఏకి పారేశారు. దువ్వాడ శ్రీనివాస్- దివ్వెల మాధురి రీల్స్ చేయడం వల్లే వైసీపీ నుంచి సస్పెండ్ చేశారని వస్తున్న వార్తలపై దివ్వెల మాధురి స్పందిస్తూ.. జగన్మోహన్ రెడ్డిని ఇన్ డైరెక్ట్‌గా ప్రశ్నించారు.
తాము డ్యాన్స్ చేయడమే తప్పు అయితే , అదే పార్టీలో ఉన్న రోజా స్టెప్స్ వేస్తే ఆహో, ఓహో అంటారా? ఇదేం పద్ధతి అంటూ ప్రశ్నించారు. రీల్స్ చేయడమే దువ్వాడ సస్పెన్షన్ కు కారణమైతే.. వైసీపీలో చాలామందిని సస్పెండ్ చేయాల్సి ఉంటుందన్నారు.
ఇక వ్యక్తిగత విషయాలపై దివ్వెల మాధురి మాట్లాడుతూ.. తామిద్దరం న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అయ్యాక పెళ్లి చేసుకుంటామని చెప్పారు.