Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆత్మహత్య యత్నం చేసిన యువతికి అండగా 'దిశ'

Advertiesment
ఆత్మహత్య యత్నం చేసిన యువతికి అండగా 'దిశ'
, శుక్రవారం, 23 జులై 2021 (11:11 IST)
తీవ్ర మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఓ యువతికి  'దిశ' పోలీస్ స్టేషన్ అండగా నిలిచింది. తాడిపత్రికి చెందిన రబ్బు అనూష (25) తల్లిదండ్రులను ఎదిరించి ఇంటర్మీడియట్ చదివే సమయంలో ప్రేమ వివాహం చేసుకుంది. కొన్నాళ్ళు సజావుగా సంసారం సాగిన తర్వాత కష్టాలు మొదలయ్యాయి.

భర్త హరిబాబు మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని వేధిస్తుండటంతో తాడిపత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు భర్తను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. తాను భర్తతో కలిసి ఉండనని, తల్లిదండ్రుల వద్దకు వెళతానని పోలీసులకు చెప్పింది. అయితే తమను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న అనూషను తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వలేదు.

ఓ వైపు తన 8 ఏళ్ల కుమారుడిని భర్త తనకు దూరం చేసి తనవద్దే ఉంచుకోవడం, మరోవైపు తల్లిదండ్రుల నిరాకరణ కలగలిసి తీవ్ర మనోవేదనకు గురయిన అనూష ఆత్మహత్యే శరణ్యమని భావించి సిద్దవటం వద్ద ఉన్న పెన్నా నదిలో దూకేందుకు ప్రయత్నించింది.

స్థానికులు అడ్డుకుని కడప నగరంలోని 'దిశ' పోలీస్ స్టేషన్ కు తీసుకు వచ్చారు. జిల్లా ఎస్.పి కె.కె.ఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు 'దిశ' డి.ఎస్.పి కె.రవి కుమార్ ఆధ్వర్యంలో మానసిక నిపుణులతో యువతికి కౌన్సిలింగ్ నిర్వహించి మనోధైర్యం కల్పించారు.

పోలీసు శాఖ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం యువతిని వన్ స్టాప్ సెంటర్‌కు తరలించారు. తనకు మనోధైర్యాన్నిచ్చి భరోసా కల్పించి అండగా నిలిచిన 'దిశ' పోలీస్ స్టేషన్‌కు, జిల్లా ఎస్.పి అన్బురాజన్‌కి యువతి కృతజ్ఞతలు తెలియచేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోల‌వ‌రంపైనా... ఆర్.ఆర్.ఆర్.పైనా పార్ల‌మెంటులో ప్ర‌ద‌ర్శ‌న‌