మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం శ్రీభ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలంలో భక్తులు పోటెత్తారు. స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం కూలైన్లో భక్తులు బారులు తీరారు. పాతాళగంగలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటున్నారు.
మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు 4 లక్షల మంది స్వామివారి దర్శనానికి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అటు యాగంటి, మహానంది, కాల్వబుగ్గ, ఓంకార క్షేత్రాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది.
దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది. శివరాత్రి నేపథ్యంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు. రాత్రి 11.30 గంటలకు గర్భగుడిలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు.