నేనంటే పడని వారి సంగతి చంద్రబాబు చూస్తారు : దేవినేని నెహ్రూ
విజయవాడ : నిన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉండి... అధికారంలో ఉన్నా లేకున్నా అందరినీ గడగడలాడించిన దేవినేని నెహ్రూ ఇపుడు టీడీపీలోనూ తన ఆధిపత్యాన్ని చెలాయించడం మొదలు పెట్టేశారు. అట్టహాసంగా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన నెహ్రూ స్టేజ
విజయవాడ : నిన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉండి... అధికారంలో ఉన్నా లేకున్నా అందరినీ గడగడలాడించిన దేవినేని నెహ్రూ ఇపుడు టీడీపీలోనూ తన ఆధిపత్యాన్ని చెలాయించడం మొదలు పెట్టేశారు. అట్టహాసంగా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన నెహ్రూ స్టేజి మీదే తన హవా నడిపించేశారు. తాను టీడీపీకి, అమరావతికి రక్షణ కవచంలా ఉంటానని చెప్పి... తన స్టామినా ఏంటో బాబుకు చెప్పే ప్రయత్నం చేశారు. ఇపుడు రెండో రోజే పార్టీ భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
టీడీపీలో చేరిన సందర్బంగా వచ్చి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని నెహ్రూ చెప్పారు. తాను ఈ నెల 15 నుంచి మాత్రమే టీడీపీలో ఉన్నానని, పార్టీ బలోపేతానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబుని కలిసి ఆయనతో సంప్రదింపులు చేస్తామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత తమపై ఉందని బాధ్యతలు అపుడే భుజాన వేసుకున్నారు. చంద్రబాబు సలహాలతో ముందుకు వెళ్తామంటూనే, కాంగ్రెస్ పార్టీ కూడా తనకు మంచి భవిష్యత్ ఇచ్చిందని చెప్పుకొచ్చారు.
2009లో తన ఓటమికి పార్టీ కారణం కాదని, పార్టీకి పని చేయించటం ద్వారా గుర్తింపు వస్తుందన్నారు. తాను పార్టీలో చేరటం మింగుడు పడని నేతల సంగతి చంద్రబాబు చూస్తారని నెహ్రూ నర్మగర్భంగా చెప్పారు. తన పరిధి కృష్ణా జిల్లా అంతా తప్ప ఒక్క విజయవాడ తూర్పు నియోజక వర్గం కాదని చెప్పుకొచ్చారు... దటీజీ్ సీనియర్ పొలిటీషియన్ నెహ్రూ.