Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'స్కిల్'లో అవినీతి జరిగిందా... చంద్రబాబు అరెస్టు దురదృష్టకరం : డిజైన్ టెక్ ఎండీ

vikas-khanvilkar
, బుధవారం, 13 సెప్టెంబరు 2023 (09:30 IST)
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టయిన నేపథ్యంలో సీమెన్స్ సంస్థతో పాటు డిజైన్ టెక్ కంపెనీ పేరు కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో డిజైన్ టెక్ ఎండీ వికాస్ ఖాన్విల్కర్ ఓ వీడియో విడుదల చేశారు.
 
ఏపీ స్కిల్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్‌లో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోలేదని స్పష్టం చేశారు. కానీ కుంభకోణం జరిగిందంటూ చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. చంద్రబాబును తానెప్పుడూ కలవలేదని ఖాన్విల్కర్ వెల్లడించారు.
 
స్కిల్ డెవలప్‌మెంట్ పథకంలో భాగంగా రెండు లక్షల మందికి శిక్షణ ఇచ్చామన్నారు. ఒప్పందంలో భాగంగా రూ.371 కోట్ల విలువైన సామగ్రిని సరఫరా చేశామని చెప్పారు. పరికరాలు బాగా లేకున్నా, మరమ్మతులు వచ్చినా బాధ్యత తీసుకున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వంతో జరిగిన ఒప్పందంలోనే దీనికి సంబంధించిన షరతు ఉందని తెలిపారు.
 
జీఎస్టీ కుంభకోణం ఉందనే ఆరోపణలు కూడా నిజం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇది సర్వీస్ ట్యాక్స్‌కు సంబంధించిన అంశమని ఆయన వివరణ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు సంస్థలు తమను సంప్రదించలేదన్నారు. ఆడిటర్లను పంపితే పూర్తి లెక్కలు చూపిస్తామని ఆయన తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీర్జాపూర్‌లో ఏటీఎం సొమ్ము దోపిడీ.. సెక్యూరిటీ గార్డును చంపేసి...