Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రధాని మోదీ పెద్దనోట్ల రద్దు కుంభకోణం రూ.8 లక్షల కోట్లు... 'గాలి'కి రూ. 2000 నోట్ల కట్టలెక్కడివి... కేజ్రీ ఫైర్

ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కంటే ఇపుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధించిన నోట్ల రద్దు ఎమర్జెన్సీ అత్యంత దారుణమైనదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. పెద్దనోట్లు అతిపెద్ద కుంభకోణం అని ఆరోపించారు. ఈ కుంభకోణం విలువ రూ.8 లక్షల కోట

Advertiesment
Demonetisation
, గురువారం, 17 నవంబరు 2016 (14:15 IST)
ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ కంటే ఇపుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధించిన నోట్ల రద్దు ఎమర్జెన్సీ అత్యంత దారుణమైనదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. పెద్దనోట్లు అతిపెద్ద కుంభకోణం అని ఆరోపించారు. ఈ కుంభకోణం విలువ రూ.8 లక్షల కోట్లు అని ఆరోపించారు. విజయ్ మాల్యాను ఎంతో చక్కగా దేశం నుంచి దాటించేసింది కాకుండా ఆయన తీసుకున్న రుణాలను మెల్లమెల్లగా రద్దు చేసేస్తున్నారని మండిపడ్డారు.
 
ఒకవైపు అవినీతి, నల్లధనం అంటూ సామాన్యులు దాచుకున్న డబ్బునంతా బ్యాంకుల్లో జమ చేయించి మరోవైపు బడా బాబులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసలు నోట్ల రద్దులో ఎలాంటి లాజిక్ లేదనీ, కేవలం కొంతమంది వ్యాపారస్తుల కోసమే నరేంద్ర మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
 
జనానికి తినేందుకు తిండి లేదు కానీ బడా బాబులు తీసుకున్న రూ. 7000 కోట్లు ఒక్క నిర్ణయంతో రద్దు చేశారని కేజ్రీవాల్ మండిపడ్డారు. కొత్తనోట్లతో అవినీతికి అంతం పలుకుతామంటున్నారు కానీ ప్రజల సొమ్ముతో బడా వ్యాపారవేత్తలు తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేసేందుకు ప్రణాళిక జరుగుతోందని విమర్శించారు. మరో మూడు రోజుల్లో నోట్ల రద్దుపై సరైన నిర్ణయం వెలువరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
 
ఒకప్పటి భాజపా నాయకుడు గాలి జనార్థన రెడ్డి తన కుమార్తె పెళ్లిని కోట్ల రూపాయలతో వివాహం చేస్తూ, రూ. 2000 కొత్త నోట్లను ఎలా వెదజల్లాడో ప్రధాని చెప్పాలన్నారు. అంతేకాదు... అంత వైభవంగా పెళ్లి జరుగుతుంటే ఆదాయపు పన్ను శాఖ అటువైపు ఎందుకు వెళ్లలేదో చెప్పాలని ప్రశ్నించారు. నోట్ల రద్దుపై మరో మూడు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ కేంద్రానికి అల్టిమేటం జారీ చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యాంప్ ఆఫీస్ క‌లిసి రాలేదు... కొత్త స‌చివాల‌యం అయినా... లక్కు కుదురుతుందా బాబూ...?