Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారీగా పెరిగిన శ్రీకాళహస్తి ఆదాయం... రాబడి 3కోట్లు.. అన్నీ పాత నోట్లే..!

పెద్ద నోట్లు రద్దు తరువాత శ్రీవారి హుండీ ఆదాయం మెల్లగా పెరుగుతోంది. నోట్లు రద్దయిన మొదటివారంలో పెద్ద మార్పు కనిపించలేదుగానీ. ఆ తరువాత క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. హుండీ కానుకలు 3కోట్లు దాటుతున్న రోజుల సంఖ్య గతంలో పోల్చితే పెరుగుతోంది. అయితే అనూహ్యం

భారీగా పెరిగిన శ్రీకాళహస్తి ఆదాయం... రాబడి 3కోట్లు.. అన్నీ పాత నోట్లే..!
, బుధవారం, 7 డిశెంబరు 2016 (15:35 IST)
పెద్ద నోట్లు రద్దు తరువాత శ్రీవారి హుండీ ఆదాయం మెల్లగా పెరుగుతోంది. నోట్లు రద్దయిన మొదటివారంలో పెద్ద మార్పు కనిపించలేదుగానీ. ఆ తరువాత క్రమంగా పెరుగుదల కనిపిస్తోంది. హుండీ కానుకలు 3కోట్లు దాటుతున్న రోజుల సంఖ్య గతంలో పోల్చితే పెరుగుతోంది. అయితే అనూహ్యంగా ఆశ్చర్యం గొలిపే స్తాయిలో మాత్రం హుండీ కానుకలు పెరగలేదు. నెల రోజుల కానుకల వివరాలు విశ్లేషిస్తే..
 
నవంబర్‌ నెలలో హుండీ ఆదాయం 3కోట్లు అంతకు మించి వచ్చిన రోజులు 14 ఉన్నాయి. 2.75కోట్లకు మించి వచ్చిన రోజులు చేస్తే 23 ఉన్నాయి. 21వ తేదీన 4.18కోట్లు సమకూరింది. గతంలో 5కోట్లకు మించి కానుకలు వచ్చిన సంధర్బమూ ఉంది. నోట్లు రద్దుకాక మునుపు అంటే నవంబర్‌ తొలివారంలో చూస్తే మూడు రోజులు 3కోట్లు దాటిన పరిస్తితి కనిపిస్తోంది. నోట్లు రద్దయిన వారంలో రెండు రోజులు 3కోట్ల కంటే ఎక్కువ ఆదాయం వచ్చింది.
 
నోట్లు రద్దన రెండోవారంలో చూస్తే గణనీయమైన ఆదాయం వచ్చింది. ఆ వారంలో 4రోజులు 3కోట్ల మార్కును దాటింది. ఒకరోజు 2.95కోట్లు. ఇంకోరోజు 2.84కోట్లు వచ్చాయి. అంటే మూడు ఓట్లకు దగ్గర్లో ఉన్నట్లు లెక్కించుకోవాలి. ఆరు రోజులూ మూడు కోట్లు వచ్చాయని అనుకోవచ్చు. అత్యధికంగా 4.18కోట్లు వచ్చిన రోజు కూడా ఈ వారంలోనే ఉంది.  నోట్ల రద్దు   అనంతరం మూడో వారంలో గమనిస్తే ఏకంగా ఐదు రోజులు 3కోట్లు దాటింది.
 
గతంలో యాత్రికుల సంఖ్య 80వేలు దాటినప్పుడు మాత్రమే హుండీ ఆదాయం 3కోట్లకు మించేదని, అయితే ఇప్పడు 60వేలు - 70వేల మంది మాత్రమే స్వామిని దర్సించుకున్నా హుండీ కానుకలు ఆ స్థాయిలో వస్తున్నాయని ఆలయ ఉద్యోగులు చెబుతున్నారు. భక్తులు సమర్పించే కానుకలు మొత్తం పెరగడం వల్లే ఆదాయంలో మార్పు కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.
 
నోట్ల మార్పిడికి డిసెంబర్‌ 31వతేదీ ఆఖరు కావడంతో ఈ నెలలో శ్రీవారి ఆలయంలో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. నోట్లు మార్చుకోలేమని వారు హుండీ ద్వారా స్వామికి సమర్పించవచ్చని భావిస్తున్నారు. అయితే కేంద్రం స్వచ్ఛంధ ఆదాయం వెల్లడికి మరో అవకాశం కల్పించింది. తమ వద్ద లెక్కల్లోలేని ధనం ఉండదని స్వచ్చందంగా ఒప్పుకుని బ్యాంకుల్లో జమచేస్తే 50శాతం పన్నుతో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవచ్చు. ఈ నేపథ్యంలో స్వామి హుండీకి అనూహ్యంగా ఆదాయం పెరగకవపోచ్చన్నది మరో అంచనా.
 
డిసెంబర్‌ 31 తరువాత పాత నోట్లు చెల్లబోవని చెబుతున్నా స్వామివారి హుండీలో పడే కానుకలను మార్చుకోవడానికి తితిదే ఇబ్బంది ఉండబోదు. మార్చి 31దాకా రిజర్వు బ్యాంకులో పాతనోట్లను మార్చుకునే వీలుంది. తితిదే ఎటూ బ్యాంకులో నగదు జమ చేస్తోంది. కాబట్టి మార్చి 31దాకా కూడా పాత నగదు హుండీలో పడే అవకాశముంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.10 లక్షల పాతనోట్లతో బాలకృష్ణ సతీమణి... ఆ డబ్బును ఏం చేశారో తెలుసా?