Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పెద్ద నోట్ల రద్దుతో అల్లకల్లోలం... కమిటీకి నేతృత్వం వహిస్తారా బాబూ... జైట్లీ, ఆలోచించి చెప్తా....

పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ప్రజల జీవితం ఒకరకంగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ముందస్తు ప్రణాళిక లేకుండా ఆర్బీఐ రూ.2000 నోట్లను జనంపైకి వదలడంతో చిల్లర కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నల్లకుబేరులకు ముకుతాడు వేయాలనుకున్న వారి ప్రణాళిక పారిన

Advertiesment
పెద్ద నోట్ల రద్దుతో అల్లకల్లోలం... కమిటీకి నేతృత్వం వహిస్తారా బాబూ... జైట్లీ, ఆలోచించి చెప్తా....
, సోమవారం, 28 నవంబరు 2016 (16:53 IST)
పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ప్రజల జీవితం ఒకరకంగా అస్తవ్యస్తంగా మారిపోయింది. ముందస్తు ప్రణాళిక లేకుండా ఆర్బీఐ రూ.2000 నోట్లను జనంపైకి వదలడంతో చిల్లర కోసం ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు నల్లకుబేరులకు ముకుతాడు వేయాలనుకున్న వారి ప్రణాళిక పారినట్లు కనబడటంలేదు. చాలామటుకు నల్లకుబేరులు కమిషన్లు ఇచ్చుకుని వైట్ నోట్లు పుచ్చుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐతే సామాన్యుడు మాత్రం నడి వీధుల్లో డబ్బు కోసం దీనంగా ఒక చేత్తో గుర్తింపు కార్డు మరో చేత్తో పాత నోట్లను పట్టుకుని బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు.
 
తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. భాజపాతో జతకట్టి ప్రభుత్వంతో నడుస్తున్న తెదేపాకు ఇబ్బందికరమైన పరిస్థితే. బ్యాంకుల ముందు ప్రజలు కష్టాల పడటం చూస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలతో ఆటలాడుకోవద్దని బ్యాంకులను హెచ్చరించారు. ఎన్నాళ్లపాటు ప్రజలను రోడ్లపై నిలబెడతారు అంటూ ప్రశ్నించారు. ఇదిలావుంటే రోజురోజుకీ సమస్య జఠిలమవుతుండటంతో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. 
 
ప్రస్తుత పరిస్థితిని త్వరితగతిన దారిలోకి తెచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటో బావుంటుందన్న దానిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేశారు. ఐదు రాష్ట్రాల సీఎంలతో కూడిన ఉపసంఘాన్ని వేస్తున్నామనీ, ఆ సంఘానికి మీరు నేతృత్వం వహిస్తే బావుంటుందని ఆయన అడిగినట్లు సమాచారం. దీనిపై చంద్రబాబు నాయుడు కాస్త ఆలోచించుకుని చెపుతానని వెల్లడించినట్లు తెలుస్తోంది. మరి జనంతో పనాయే...!!

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నల్లకుబేరులకు మరిన్ని కష్టాలు.. "పన్ను" పీకేందుకు ఐటీ చట్టానికి సవరణలు