Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీకాళహస్తిలో ఆర్‌బిఐ నిబంధనలకు పాతర, ఇబ్బడిముబ్బడిగా పాత నోట్లు మార్పిడి

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రసిద్థి చెందిన శ్రీకాళహస్తిలో ఉన్నతాధికారులు ఆర్‌బిఐ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. పాత నోట్ల మార్పిడి వ్యవహారంలో నిబంధనలనూ పట్టించుకోదన్న విమర్శలు వినిపిస్తున్నారు. నవం

శ్రీకాళహస్తిలో ఆర్‌బిఐ నిబంధనలకు పాతర, ఇబ్బడిముబ్బడిగా పాత నోట్లు మార్పిడి
, గురువారం, 8 డిశెంబరు 2016 (21:21 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రసిద్థి చెందిన శ్రీకాళహస్తిలో ఉన్నతాధికారులు ఆర్‌బిఐ నిబంధనలను బేఖాతరు చేస్తున్నారు. పాత నోట్ల మార్పిడి వ్యవహారంలో నిబంధనలనూ పట్టించుకోదన్న విమర్శలు వినిపిస్తున్నారు. నవంబర్‌ 8వ తేదీ రాత్రి నుంచే పాత 500, వెయ్యి నోట్లను రద్దు చేస్తూ భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రులు, పెట్రోలు బంకులు వంటి చోట్ల మాత్రం వారం రోజులు చెల్లుబాటు అయ్యేలా నిర్ణయం తీసుకుంది. ఆ తరువాత వాటి చెలామణిని పూర్తిగా రద్దు చేసింది. ఇప్పటికే ప్రభుత్వ బకాయిలు వంటివి చెల్లించడానికి 500 నోట్లకు మాత్రమే అవకాశం ఉంది. వెయ్యి చెలామణికి ఆలయాలకు ఎక్కడా అవకాశం కల్పించలేదు. అందుకే తితిదే వంటి సంస్థ కూడా నవంబర్‌ 8వ తేదీ రాత్రి నుంచే పాత నోట్లు తీసుకోవడం ఆపేసింది. 
 
అయితే ఆర్‌బిఐ నిబంధనలు, కేంద్రం నిబంధనలతో తనకు సంబంధం లేదన్నట్లు శ్రీకాళహస్తి ఆలయంలో మాత్రం పాతనోట్లు తీసుకుంటున్నారు. పూజలు, దర్శనాలు, ప్రసాదాలు, గదుల వద్దే కాదు..విరాళాల రూపంలోనూ పాతనోట్లను తీసుకోవడం గమనార్హం. భక్తులకు అసౌకర్యం కలుగకూడదనే పేరుతో పాత నోట్లను తీసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి గండిపడుతోంది. నల్లకుబేరుల దొంగ మార్గాల్లో బ్లాక్‌ మనీని మార్చుతున్నారని గుర్తించి చాలా ఆంక్షలను తీసుకొచ్చింది ప్రభుత్వం. 
 
ఈ క్రమంలో ఆలయాల కేంద్రంగా నల్లనోట్ల మార్పిడి జరిగే అవకాశం ఉండటంతో నవంబర్‌ 8వ తేదీ నాటికి ఆలయాల వద్ద పాతనోట్లు ఎంత ఉన్నాయో చెప్పాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. హుండీ ద్వారా వచ్చే పాత నోట్లు మినహా ఎక్కడా లావాదేవీల రూపంలో పాతనోట్లను స్వీకరించడానికి వీల్లేదు. వాటిని బ్యాంకుల్లో వేయడానికి వీల్లేదు. ఆలయంలో విరాళాల రూపంలోనూ పాత నోట్లను స్వీకరిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తుంటే ఆ డబ్బులను బ్యాంకుల్లో జమ చేసుకుంటున్న బ్యాంకర్ల తీరు మరింత ఆశ్చర్యం కలిగిస్తోంది.
 
నల్లధనం మారకుండా కట్టడి చేయడానికి కేంద్రం చాలా ప్రయత్నాలే చేస్తోంది. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో పాత నోట్ల మార్పిడిని కూడా ఆపేసింది. అకౌంట్‌లో జమ చేసుకోవడం మినహా మరో మార్గం లేకుండా చేసింది. అయినా శ్రీకాళహస్తి ఆలయంలో నోట్ల మార్పిడి యథేచ్ఛగా సాగుతుండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. పాత నోట్లు తీసుకోవడం వల్ల జరుగుతున్న అక్రమాలు ఈఓకు తెలియదనుకోవాలా? తెలిసినా ఆలయానికి ఆదాయం వస్తోంది కదా అనే పేరుతో ఉదాశీనంగా ఉన్నారా? నల్ల నోట్ల మార్పిడికి సహకరించేవారిపైన పోలీసు కేసులు పెడతామని కేంద్రం పదే పదే హెచ్చరిస్తోంది. అయినా తమ తప్పును శ్రీకాళహస్తి ఆలయ అధికారులు ఎందుకు గుర్తించడం లేదు. ఇప్పటికైనా పాత నోట్లు తీసుకోవడాన్ని తక్షణం ఆపాలి. నల్లధనాన్ని మార్చుకోవడానికి నల్లకుబేరులకు రాచమార్గంగా ఉన్న ఆలయ దారులను వెంటనే మూసేయాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాంకుల్లో డబ్బులేసి వైట్ అయ్యిందనుకోవద్దు... లెక్కచూసి తాట తీస్తాం.. జైట్లీ హెచ్చరిక