Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తీరనున్న చిల్లర కష్టాలు.. హైదరాబాదులో రూ.500 నోట్లు వచ్చేశాయ్..

రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యులతో పాటు టాటా బిర్లాలకే ఇబ్బందులు తప్పలేదు. టాటా, బిర్లా, మహేంద్ర గ్రూపులకు చెందిన మార్కెట్ విలువ కుప్పకూలింది. దాదాపు 9 బిలియన్ డాలర్ల సంపద తుడిచి పెట్టు

Advertiesment
Delay in releasing new ₹500 notes adds to cash crunch
, గురువారం, 24 నవంబరు 2016 (10:00 IST)
రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో సామాన్యులతో పాటు టాటా బిర్లాలకే ఇబ్బందులు తప్పలేదు. టాటా, బిర్లా, మహేంద్ర గ్రూపులకు చెందిన మార్కెట్ విలువ కుప్పకూలింది. దాదాపు 9 బిలియన్ డాలర్ల సంపద తుడిచి పెట్టుకుపోయింది.
 
ఈ నేపథ్యంలో కొత్త రూ.500 నోట్లు వచ్చేశాయి. రూ.2000 నోటుకు చిల్లర లేకపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. తాజాగా హైదరాబాద్ ఏటీఎంలలో కొత్త రూ.500నోట్లు రావడంతో ఇకపై ప్రజలకు చిల్లర కష్టాలు తీరనున్నాయి.  
 
రిజర్వ్‌ బ్యాంకు ఎదురుగా ఉన్న ఆంధ్రా బ్యాంకు ఏటీఎంలో వీటిని ఉంచారు. ఈ విషయం తెలిసిన జనం అర్థరాత్రే ఏటీఎం ఎదుట బారులు తీరారు. రెండు రాష్ట్రాలకు కలిపి రూ.400 కోట్ల విలువైన కొత్త రూ.500 నోట్లను రిజర్వ్ బ్యాంకు పంపించింది. పెద్దనోట్ల రద్దు అనంతరం కొత్త రూ.2000 నోట్లను కేంద్రం అందుబాటులోకి తీసుకువచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిద్రపోతున్న గర్ల్ ఫ్రెండ్‌పై పైతాన్లను పడేసిన బాయ్ ఫ్రెండ్.. ప్రాక్టికల్ జోక్ అట..