పల్నాడులో ఓడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఎన్నికల సమయంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ సవాల్ చేశారు. త ఎన్నికల సమయంలో నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని ఛాలెంజ్ చేసింది నిజమే. ఆ సమయంలో నా సవాల్‌ను టీడీపీ నేతలు స్వీకరించలేదు.
ఆనాడు ఛాలెంజ్ స్వీకరిస్తే బాగుండేది. అలా కాకుండా ఇప్పుడు ట్రోల్ చేయడం సరికాదు. మంత్రుల నోటి దురుసు వల్ల ఓడిపోయామనే అంశం నిజమైతే సరిదిద్దుకుంటాం.
ఏదీ ఏమైనప్పటికీ ప్రజా తీర్పును గౌరవిస్తాం. నరసరావుపేట లోక్ సభలో నాకు ఓటు వేసిన 6 లక్షల మంది ఓటర్లకు ధన్యవాదాలు... అంటూ అనిల్ చెప్పారు. మేం పారిపోలేదు. తనకు ప్రతిపక్షంలో ఉండటం కొత్త కాదు. గత పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం. మళ్ళీ ఉంటాం.. లోపాలు సరిదిద్దుకుని ముందుకు వెళ్తాం.. అని అనిల్ అన్నారు.