Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నంద్యాల ఉప ఎన్నికలు.. సీన్లోకి బ్రహ్మానందరెడ్డి.. టీడీపీ అభ్యర్థి రేసులో భూమా చిన్నకుమార్తె కూడా?

దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో నంద్యాల ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. వైసీపీ కూడా బరిలో దిగుతామని ప్రకటించడంతో బలమైన అభ్యర్థఇని బరిలో నిలిపేందుకు తెలుగుదే

నంద్యాల ఉప ఎన్నికలు.. సీన్లోకి బ్రహ్మానందరెడ్డి.. టీడీపీ అభ్యర్థి రేసులో భూమా చిన్నకుమార్తె కూడా?
, శుక్రవారం, 17 మార్చి 2017 (11:55 IST)
దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో నంద్యాల ఉప ఎన్నిక ఆసక్తికరంగా మారింది. వైసీపీ కూడా బరిలో దిగుతామని ప్రకటించడంతో బలమైన అభ్యర్థఇని బరిలో నిలిపేందుకు తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ముందుగా భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె పేరు తెరపైకి వచ్చింది. ప్రస్తుతం నంద్యాల టీడీపీ ఎమ్మెల్యే రేసులో భూమా బ్రహ్మానందరెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. 
 
నిజానికి శోభా నాగిరెడ్డి మరణించిన సమయంలోను ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసేందుకు బ్రహ్మానందరెడ్డి రెడీ అయ్యారు. కానీ భూమా పెద్ద కుమార్తె అఖిలప్రియకు ఆ స్థానం కేటాయించడంతో బ్రహ్మానందరెడ్డి వ్యాపారాల్లోనే మునిగిపోయారు. ప్రస్తుతం ఆళ్లగడ్డలో భూమా కుటుంబానికి చెందని జగత్ డైరీ వ్యవహారాలను బ్రహ్మానంద రెడ్డి చూసుకుంటున్న తరుణంలో.. నంద్యాల స్థానంలో ఆయన్ని బరిలోకి దించే విషయమై టీడీపీ రంగం సిద్ధం చేస్తోంది. 
 
ఇకపోతే.. వైసీపీ నేత, బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి బ్రహ్మానందరెడ్డి అల్లుడు కావడం విశేషం. బ్రహ్మానందరెడ్డి గనుక ఎన్నికల బరిలో నిలిస్తే.. కాటసాని వర్గం నుంచి కూడా ఆయనకు మద్దతు లభించే అవకాశముందని టీడీపీ ప్లాన్ వేస్తోంది. సానుభూతి పరంగా భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తెను బరిలోకి దించాలని కూడా టీడీపీ కసరత్తు చేస్తోంది. మరి భూమా నాగిరెడ్డి అకాల మరణంతో జరుగనున్న నంద్యాల ఉప ఎన్నికల్లో బ్రహ్మానంద రెడ్డి లేదా భూమా చిన్న కుమార్తె.. వీరిద్దరిలో టీడీపీ ఎవరికి ఛాన్స్ ఇస్తుందో తెలియాలంటే వేచి చూడాలి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ చెప్పిన మాట నిజమేనా? ఉత్తరాది అహంకారం... మోదీ అలా ఎందుకు చేస్తున్నారు?