Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నిర్భయ, దిశ బలైనా ఆగని అకృత్యాలు.. కఠినమైన శిక్షలుంటేనే..?

నిర్భయ, దిశ బలైనా ఆగని అకృత్యాలు.. కఠినమైన శిక్షలుంటేనే..?
, సోమవారం, 23 డిశెంబరు 2019 (09:01 IST)
భారతదేశంలో మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నిర్భయ, దిశ లాంటి ఘటనలు జరుగుతున్నా.. కఠినమైన చట్టాలను అమలు కావట్లేదు. దీంతో కామాంధులు ఏమాత్రం భయం లేకుండా మహిళలపై విరుచుకుపడుతున్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు రోజు రోజుకీ పెరిగిపోతూనే వున్నాయి. 
 
అదీ దిశ ఘటన అనంతం కామాంధులపై ఏపీ సర్కారు సీరియస్ అయినా ఆగడాలు మాత్రం ఆగట్లేదు. తాజాగా ఏపీలోని చిత్తూరు, ఒడిశాలోని ఢెంకనాల్ జిల్లాలో జరిగిన వేర్వేరు ఘటనలు కలకలం రేపాయి. చిత్తూరు జిల్లా యాదమరి మండలానికి చెందిన వివాహిత (32) మానసిక సమస్యలతో బాధపడుతూ నాలుగేళ్లుగా చికిత్స పొందుతోంది. 
 
శనివారం ఆమె తన ఇంటి వెనక కూర్చున్న సమయంలో పొరుగింటిలో ఉన్న యువకుడు (35) ఆమె ఇంట్లోకి చొరబడి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
ఒడిశాలోని ఢెంకనాల్ జిల్లాలోనూ ఇటువంటి ఘటనే జరిగింది. మతిస్థిమితం లేని పదేళ్ల బాలికపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి తెగబడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు