Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

లోకేష్ వెన్నుపోటు పొడుస్తాడేమోనని బాబుకు భయం... పవన్ మెరుపులా మాయం...

రాజకీయ నాయకుల్లో అతికొద్దిమంది తాము అనుకున్నది అనుకున్నట్లుగా ముఖం మీదే చెప్పేస్తుంటారు. ఈ విషయంలో ఎవరు ఎలా నొచ్చుకున్నా వాళ్లు పట్టించుకోరు. అలాంటివారిలో సీపీఐ పార్టీకి చెందిన నారాయణ ఒకరు. కేంద్రం బడ్జెట్ కేటాయింపులపై నారాయణ స్పందించారు. ఈ సందర్భంగా

Advertiesment
CPI Narayana comments
, శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (15:56 IST)
రాజకీయ నాయకుల్లో అతికొద్దిమంది తాము అనుకున్నది అనుకున్నట్లుగా ముఖం మీదే చెప్పేస్తుంటారు. ఈ విషయంలో ఎవరు ఎలా నొచ్చుకున్నా వాళ్లు పట్టించుకోరు. అలాంటివారిలో సీపీఐ పార్టీకి చెందిన నారాయణ ఒకరు. కేంద్రం బడ్జెట్ కేటాయింపులపై నారాయణ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అమరావతి కేపిటల్ గెయిన్స్ పేరుతో ఏపీని కేంద్రం దగా చేసిందని దుయ్యబట్టారు. బడ్జెట్టులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
 
ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు చూసి జడుసుకున్నారని అన్నారు. భవిష్యత్తులో తన కొడుకు కూడా ములాయం సింగ్ యాదవ్‌కు అఖిలేష్ వెన్నుపోటు పొడిచినట్లు వ్యవహరిస్తాడేమోనన్న భయంతో లోకేష్ బాబుకు మంత్రి పదవి కట్టబెట్టబోతున్నారని విమర్శించారు.
 
ఇక జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ నిలకడలేని రాజకీయాలు చేస్తున్నారనీ, రాజకీయాల్లో ఆయన ఓ మెరుపులా మెరిసి మాయమవుతున్నాడని పేర్కొన్నారు. ఇలాంటి మెరుపులు ఎక్కువసేపు వుండవనీ, సమయం వచ్చినప్పుడు మెరిసి మాయమవుతుంటాయని అన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ మెరుపులా కాకుండా నిలకడగా రాజకీయాలు చేయాలనీ, లేదంటే భవిష్యత్తు వుండదని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహిళ ముక్కులోకెళ్లిన బొద్దింక... ఏం చేసిందో తెలుసా?