Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాలో నకిలీ టాటా విరాన్ చైన్ లింక్ ఫెన్స్ స్వాధీనం

రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాలో నకిలీ టాటా విరాన్ చైన్ లింక్ ఫెన్స్ స్వాధీనం
, మంగళవారం, 18 జనవరి 2022 (19:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల సహాయంతో టాటా స్టీల్ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాలో ఉన్న ఎస్ఆర్ ఇండస్ట్రీస్ మరియు వెంకటాద్రి వైర్ నెట్టింగ్ ఇండస్ట్రీస్ పై దాడులు నిర్వహించి ప్రామాణీకరణ ప్యాకేజీలో లేకుండా విక్రయిస్తున్న నకిలీ టాటా విరాన్ చెయిన్ లింక్ ఫెన్స్ స్వాధీనం చేసుకున్నారు. టాటా విరాన్ యొక్క చైన్ లింక్ ఫెన్స్‌లు మరియు బార్బ్‌డ్ వైర్లు వినూత్నమైన పద్ధతిలో ప్యాకేజీ చేయబడటంతో పాటుగా ఒరిజినల్ ఉత్పత్తులన్నీ కూడా అదే తరహా ప్యాకేజింగ్‌ను కలిగి ఆధీకృత డీలర్లు మరియు డిస్ట్రిబ్యూటర్ల వద్ద విక్రయించబడుతుంటాయి.

 
మోసపూరిత కార్యకలాపాలను గురించి తామందుకున్న సమాచారం ప్రకారం, టాటా స్టీల్ అధికారులతో పాటుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉమ్మడిగా ఈ దాడులు నిర్వహించడంతో పాటుగా 1.26 లక్షల రూపాయల విలువ కలిగిన నకిలీ ఉత్పత్తులను జనవరి 7, 2022న స్వాధీనం చేసుకున్నారు. పైన పేర్కొన బడిన సంస్థపై ఎఫ్ఐఆర్‌ను ఐపీసీ సెక్షన్ 420, 483 మరియు 486 మరియు ట్రేడ్‌మార్క్ చట్టం సెక్షన్ 103,104 ప్రకారం కేసులు నమోదు చేశారు.

 
ఆధీకృతం కాకుండా టాటా విరాన్ పేరును వినియోగించడం అనేది టాటా స్టీల్ యొక్క మేధో సంపత్తి హక్కులను ఉల్లంఘించడమే! ఈ స్టోర్ యజమాని నకిలీ చెన్‌లింక్ ఫెన్స్, బార్డ్బ్ వైర్లను నాణ్యత లేకుండా విక్రయించడంతో పాటుగా వాటిని టాటా విరాన్ ఉత్పత్తులుగా వెల్లడించి విక్రయిస్తున్నారు.

 
వినియోగదారుల మనస్సులో టాటా స్టీల్ ఉత్పత్తులకు, నాణ్యమైన ఉత్పత్తులుగా అసాధారణ గౌరవం ఉంది. ఈ తరహాలో అనధికారికంగా టాటా పేరును, నాణ్యతా ప్రమాణాలు అందుకోని మరియు టాటా స్టీల్ ఉత్పత్తులు కాని వాటికి వినియోగించడం ద్వారా టాటా స్టీల్ గౌరవానికి తీవ్ర విఘాతం కలుగుతుంది. టాటా స్టీల్ ట్రేడ్‌మార్క్స్, లోగోలను మరియు టాటా సన్స్ లోగోలు మరియు ట్రేడ్‌మార్క్స్‌ను అనధికారికంగా, ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా వినియోగించడాన్ని టాటా స్టీల్ తీవ్రంగా ఖండిస్తుంది. మా బ్రాండ్ పరపతి మరియు గుడ్‌విల్‌ను కాపాడుకునే క్రమంలో, టాటా స్టీల్ యొక్క బ్రాండ్ ప్రొటెక్షన్ బృందం స్థిరంగా ఈ అంశాలను పర్యవేక్షించడంతో పాటుగా మా మేథో సంపత్తి హక్కులకు భంగం కలిగించేలా ప్రవర్తించడంతో పాటుగా నకలీలను చేయడంపై కఠిన చర్యలు తీసుకుంటుంది.

 
టాటా స్టీల్ ఆస్తులు మరియు బ్రాండ్‌పై ప్రభావం చూపే ఈ తరహా చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు ఏవైనా సరే మేము వాటికి వ్యతిరేకంగా చర్యలను తీసుకోవడంతో పాటుగా ఈ ప్రయత్నంలో మా చర్యలను కొనసాగిస్తున్నాము.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టెస్లా కంపెనీని చంద్రబాబు ఒప్పిస్తే... జగన్ రెడ్డి తరిమికొట్టారు...