Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కరోనా మహమ్మారి ఉధృతం .. అధికారుల పనితీరు భేష్: మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని

Advertiesment
కరోనా మహమ్మారి ఉధృతం .. అధికారుల పనితీరు భేష్:  మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని
, సోమవారం, 26 ఏప్రియల్ 2021 (20:27 IST)
కృష్ణాజిల్లాలో అధికార యంత్రాంగం కోవిడ్ స్టెయిన్ నియంత్రణకు 104 కాల్ సెంటర్ ద్వారా ప్రజలతో మమేకమై 24 గంటలూ సేవలు అందిస్తోందని మంత్రులు పేర్ని వెంకట్రామయ్య (నాని), కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)లు అన్నారు. స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో కోవిడ్‌పై మంత్రులు, కలెక్టర్‌ ఆధ్వర్యంలో శాసనసభ్యులు, వైద్యాధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, రవాణా శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ ప్రజాప్రతినిధులుగా కరోనా కష్ట సమయంలో మనవంతు బాధ్యతగా స్థానికంగా ప్రణాళికలను రూపొందించి అమలు చేయాల్సిందేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలమేరకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను అమలు చేస్తున్నదన్నారు.

ఆక్సిజన్ లెవెల్ తక్కువుగా ఉందని, కరోనాబారిన పడినవారు, వారి కుటుంబసభ్యులు ఆందోళనతో ఆసుపత్రుల్లో సేవలు కోసం కోరుతున్నారన్నారు. మనోనిబ్బరం ఉంటే కరోనాను జయించవచ్చని డాక్టర్లు, ప్రముఖులు చెబుతున్నారని, యువత కరోనా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కనీసం మాస్క్  ధరించకపోవడం, శానిటైజర్ పట్ల జాగ్రత్త వహించట్లేదన్నారు.

డాక్టర్లు రోగి పరిస్థితిని అంచనా వేసి అవసరమైన వారికి ఆక్సిజన్, వెంటి లేటర్ చికిత్సలను అందిస్తున్నారన్నారు. మహమ్మారి సమయంలో ఎవరినీ తప్పుపట్టడానికి వీల్లేదన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని వాటి నియంత్రణకు ప్రజలు ఎవరికివారు కోవిడ్ మార్గదర్శకాలను పాటించాల్సిందేనన్నారు. జిల్లాలోని పరిస్థితులకు అనుగుణంగా ఆసుపత్రుల్లో బెడ్ల స్థాయిని పెంచుతున్నారన్నారు.

తక్కువ లక్షణాలు ఉన్నవారు, ఆక్సిజన్ లెవెల్ బాగున్నవారు కోవిడ్ కేర్ సెంటరలో చికిత్సలు పొందవచ్చునని మంత్రి పేర్చి నాని అన్నారు. ప్రభుత్వం నిర్వహించే కేంద్రాల్లో ఉచితంగా మందులు ఇవ్వడంతో పాటు మెరుగైన చికిత్స అందిస్తున్నారని, ఎటువంటి ఆందోళనకు గురి కావద్దన్నారు. కోవిడ్ పరిస్థితులపై ప్రజాప్రతినిధులతో ఏర్పాటుచేసిన సమావేశానికి వియంసి అధికారులు హాజరుకాకపోవడం పై మంత్రి అసహనం వ్యక్తం చేసి వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. 

రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు (నాని) మాట్లాడుతూ జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యచికిత్సలు అందించడం జరుగుతోందన్నారు. కరోనా స్ట్రెయిన్ వలన కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కుంటున్నామన్నారు. కోవిడ్ ఆసుపత్రుల్లో పౌష్టికాహారం అందించుట ద్వారా ఇమ్యునిటీ లెవెల్‌ను పెంచుతున్న‌ట్లు తెలిపారు.

ఆక్సిజన్, రెమిడి సివిర్ ఇంజక్షన్లు కోసం కోరడం జరుగుతోందని, రాష్ట్ర ప్రభుత్వం తగిన నిల్వలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నదన్నారు. జిల్లా కలెక్టర్ ఏ.యండి.ఇంతియాజ్ మాట్లాడుతూ కరోనా బారిన పడినవారికి మెరుగైన వైద్యచికిత్సలు అందించేందుకు పూర్తి స్థాయిలో వైద్యసిబ్బంది సేవలు అందిస్తున్నారన్నారు. మరిన్ని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని కలెక్టర్‌ తెలిపారు.

జిల్లాలో 46 ఆసుపత్రులు ద్వారా కోవిడ్ బాధితులకు వైద్యచికిత్సలు అందిస్తున్నామన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా సమాంతరంగా చేపట్టడం జరుగుతోందని, ఇప్పటికే 4,70,000 మందికి పైగా వ్యాక్సినేషన్ ఇచ్చామని, కోవిడ్ వ్యాప్తి నివారణ, హాస్పటల్స్, బెడ్స్, వైద్య సేవలు, టెస్టు, ఆక్సిజన్, మందులు, అంబులెన్లు, 104 సేవలు వంటి 25 రకాల సేవలకు సంబంధించి జిల్లా నోడల్ అధికారులను నియమించుకుని ఎ ప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు.

టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ కూ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. గతంలో వచ్చిన కరోనా వైరస్ వ్యాప్తి 1 : 2 గా ఉండేదని, ప్రస్తుతం ఐదు రెట్లు పెరిగి, 1 : 10 గా కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి ఉందన్నారు. కేవలం ఆందోళనతో పరిస్థితులు ఇబ్బంది తలెత్తుతున్నాయని, ప్రజలు ముఖ్యంగా మనోనిబ్బరంతో ఉంటే కరోనా వైరస్ ను సులభంగా జయించవచ్చన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో వ్యాపార సంస్థల‌ స‌మ‌యం కుదింపు