Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లోకేష్‌ ‘పుష్ప మహారాజ్’: మంత్రి అనిల్ వివాదాస్పద వ్యాఖ్యలు

Advertiesment
లోకేష్‌ ‘పుష్ప మహారాజ్’: మంత్రి అనిల్ వివాదాస్పద వ్యాఖ్యలు
, శనివారం, 31 అక్టోబరు 2020 (05:46 IST)
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పర్యటనలో భాగంగా వరద బాధిత ప్రాంతాల్లో ట్రాక్టర్ నడిపిన విషయం విదితమే. అయితే ఆ ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు, కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు హేళన చేస్తూ మాట్లాడుతున్నారు.

తాజాగా రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. నారా లోకేష్‌పై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌ను ‘పుష్ప మహారాజ్’ అంటూ మంత్రి సంబోధిస్తూ విమర్శలు గుప్పించారు.
 
‘నారా లోకేష్‌ ఆరోపణలకు సమాధానం చెప్పడమే మా ఖర్మ. పప్పుబాయ్ మంగళగిరిలో నీకు అదే గతి. గోచికూడా మిగలదు. ఎంత మంది కట్టకట్టుకుని కుట్రలు పన్నినా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 151 సీట్లతో సీఎం అయ్యారు.

టీడీపీ నేతలు మర్యాదగా మాట్లాడితే మార్యాదగా మాట్లాడుతాం.  నీ లాగా, మీ బాబులాగా మీ తాత పార్టీ లాక్కొని జగన్ సీఎం కాలేదు. దేశంలోనే రైతుల సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కరించిన నేత జగన్. లోకేష్‌ ముందు ట్రాక్టర్ సరిగా నడపడం నేర్చుకోవాలి. మీపార్టీ నేతలే నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరు.

పోలవరం పనులు 70 శాతం పూర్తయితే మీసాలు తీసేస్తానన్న నేత ఎక్కడా అని మీసాలు లేని నేత మాట్లాడుతున్నారు. లక్ష కుటుంబాలున్నాయి.. వారందరికీ ఇళ్లు నిర్మించాలి. 50 శాతమే పూర్తయ్యాయంటే వినరు. ఏ కమీషన్ల కోసం కేబినెట్ నోట్ పెట్టారో చెప్పండి. పోలవరం పూర్తిచేసి తీరుతాం.

శాన్ ఫోర్డ్ వీరుడు, పప్పు వీరుడు. ఏ జన్మలో పుణ్యం చేసుకోబట్టో జగన్ క్యాబినేట్‌లో నీటిపారుదల శాఖ మంత్రిని అయ్యాను. జగన్ పాదం వల్లే రెండేళ్లుగా డ్యామ్‌లు అన్నీ నిండుతున్నాయి. మీ తాత, మీనాన్న ముఖ్యమంత్రులైనా మంగళగిరిలో (లోకేష్) ఓడిపోయావ్’ అని లోకేష్‌పై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీసం తీస్తానన్న మంత్రి ఎక్కడ....?: నారా లోకేశ్