తెలుగు రాష్ట్రాల్లో వరకట్న వేధింపుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వరకట్నాన్ని నిషేధిస్తూ చట్టం చేసినప్పటికీ వరకట్న హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
అత్తారింట్లో వేధింపులు తట్టుకోలేక, పుట్టింటికి వెళ్లలేక అనేక మంది మహిళలు బలవుతున్నారు. ఉద్యోగం చేస్తున్న వారైనా, గృహిణులైనా వరకట్న వేధింపులకు గురవుతున్నారు.
తాజాగా మెదక్ జిల్లాలో అలాంటి ఘటనే వెలుగు చూసింది. కానిస్టేబుల్‌గా పని చేస్తున్న బండి శ్యాంకుమార్ కొద్ది రోజుల క్రితం రెండవ పెళ్లి చేసుకున్నాడు. కాగా మొదటి భార్య లహరిని వరకట్నం కోసం వేధించడం మొదలుపెట్టాడు.
పుట్టింటి నుండి 10 లక్షల రూపాయలు తీసుకురావాలని బలవంతం చేసాడు. అయితే భర్త అడిగిన డబ్బులు తీసుకురాలేక, అతడి వేధింపులను తట్టుకోలేక లహరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. లహరి కుటుంబసభ్యులు మెదక్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.