Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుష్కరాల తొలి రోజు అపశృతి : ఓ కానిస్టేబుల్ జీవితం విషాదాంతం...

కృష్ణా పుష్కరాల తొలి రోజున అపశృతి చోటుచేసుకుంది. పుష్కరాల బందోబస్తు విధుల కోసం వచ్చిన ఓ కానిస్టేబుల్ జీవితం విషాదాంతంగా ముగిసింది. తిరుపతి నుంచి వచ్చిన కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

పుష్కరాల తొలి రోజు అపశృతి : ఓ కానిస్టేబుల్ జీవితం విషాదాంతం...
, శుక్రవారం, 12 ఆగస్టు 2016 (11:13 IST)
కృష్ణా పుష్కరాల తొలి రోజున అపశృతి చోటుచేసుకుంది. పుష్కరాల బందోబస్తు విధుల కోసం వచ్చిన  ఓ కానిస్టేబుల్ జీవితం విషాదాంతంగా ముగిసింది. తిరుపతి నుంచి వచ్చిన కానిస్టేబుల్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... ఏపీ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న వెంకట్రావు, పుష్కర విధుల నిమిత్తం గూడవల్లి ప్రాంతానికి వచ్చారు. విధి నిర్వహణలో భాగంగా రోడ్డు దాటుతున్న వేళ, ఓ ఇన్నోవా కారు వచ్చి అతన్ని బలంగా ఢీకొంది. 
 
ఈ ప్రమాదంతో రోడ్డు డివైడరుకు వెంకట్రావు తల తగలడంతో, ఆయన అక్కడికక్కడే మరణించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. కానిస్టేబుల్ కుటుంబాన్ని ఆదుకుంటామని అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టిక్కెట్ కొనకుండా కొండపైకి వెళ్ళిన బాలకృష్ణ.. ప్రోటోకాల్ ఉల్లంఘన