Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీ అంటరాని పార్టీ కాదు.. పొత్తుకు సిద్ధం : కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డి

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అంటరాని పార్టీ కాదని, ఆ పార్టీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకునేందుకు సిద్ధంగా ఉందని ఆయన ప్రకటిం

Advertiesment
Congress Leader S Jaipal Reddy
, గురువారం, 25 మే 2017 (16:09 IST)
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్.జైపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అంటరాని పార్టీ కాదని, ఆ పార్టీతో కాంగ్రెస్ పొత్తుపెట్టుకునేందుకు సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. అయితే, పొత్తుల విషయంలో టీడీపీ తీసుకునే నిర్ణయాన్ని బట్టి తాము కూడా నిర్ణయం తీసుకుంటామన్నారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటనపై ఆయన స్పందిస్తూ షా పర్యటన వల్ల తెలంగాణకు ఏమాత్రం ఉపయోగం లేదనే విషయం తనకు ముందే తెలుసన్నారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చిందేమీ లేదని... రాష్ట్రానికి వచ్చిన నిధులన్నీ చట్ట ప్రకారం, రాజ్యంగ బద్ధంగా వచ్చినవే అని తెలిపారు. అమిత్ షా చెప్పిన లెక్కలన్నీ కాకి లెక్కలే అని విమర్శించారు.
 
ఇకపోతే.. తెలుగుదేశం పార్టీతో గతంలో ఉన్న శత్రుత్వం ఇప్పుడు లేదన్నారు. టీడీపీ తమకు అంటరాని పార్టీ కాదన్నారు.  టీఆర్ఎస్, బీజేపీలకు మాత్రం తాము పూర్తిగా వ్యతిరేకమన్నారు. టీఆర్ఎస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అవలంభిస్తోందని జైపాల్ రెడ్డి విమర్శించారు. ప్రధానిమంత్రి నరేంద్ర మోడీతో స్నేహం అంటూనే, అమిత్ షాతో వైరం అంటూ కేసీఆర్ రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఇది ముమ్మాటికీ మ్యాచ్ ఫిక్సింగేనని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తేజస్ లగ్జరీ రైలులో హెడ్ ఫోన్లు మాయం.. ప్రయాణీకుల చేతివాటం.. ఛీ.. ఛీ.. ఇదేంపని?