Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 3 April 2025
webdunia

నారా లోకేష్‌ను ఉతికి ఆరేసిన సినీనటి నగ్మా

ఒకరు రాజకీయాలు.. మరొకరు సినీపరిశ్రమ. అందులోనూ నగ్మా. ఈమె ఎప్పటి హీరోయినో.. ఇప్పటి సినిమాల్లో అసలామె నటించడం లేదు. కనీసం మన రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధి కూడా కాదు నగ్మా. అలాంటిది నారా లోకేష్‌ను న

Advertiesment
Congress leader Nagma
, మంగళవారం, 14 మార్చి 2017 (14:14 IST)
ఒకరు రాజకీయాలు.. మరొకరు సినీపరిశ్రమ. అందులోనూ నగ్మా. ఈమె ఎప్పటి హీరోయినో.. ఇప్పటి సినిమాల్లో అసలామె నటించడం లేదు. కనీసం మన రాష్ట్రానికి చెందిన ప్రజాప్రతినిధి కూడా కాదు నగ్మా. అలాంటిది నారా లోకేష్‌ను నగ్మా ఉతికి ఆరేయడం ఏమిటో అర్థం కాలేదు కదూ.. అయితే ఇది చదవండి.. మీకే అర్థమవుతుంది.  
 
కేవలం ఐదు నెలల కాలంలోనే లోకేష్ ఆస్తులు రూ.14.5 కోట్ల నుంచి రూ.330 కోట్లకు పెరిగిపోవడంపై దేశ వ్యాప్తంగా చర్చజరుగుతోంది. హిందుస్థాన్‌ టైమ్స్ లాంటి పత్రికలు కూడా లోకేష్‌ను కడిగిపారేశాయి. ఇప్పుడు ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుత కాంగ్రెస్ నాయకురాలు నగ్మా కూడా లోకేష్‌పై ఘాటు ట్వీట్ చేశారు. నోట్ల రద్దు నిజంగానే ఎన్‌డీఏకు ఒక వరం అని, కావాలంటే ఈ సాధారణ వ్యక్తి అతి తక్కువ సమయంలోనే అసాధారణ ధనికుడిగా ఎలా మారారో చూడండి అంటూ ట్వీట్స్ చేశారు. 
 
నోట్ల రద్దు పుణ్యమాని ఒకవైపు నోట్ల రద్దు వల్ల ఉద్యోగాలు పోగొట్టుకున్న సామాన్యుల ఫొటోను, మరోవైపు నారా లోకేష్, చంద్రబాబు ఫొటోను పోస్ట్ చేసి ట్వీట్ చేశారు నగ్మా. ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడి ఆస్తులు కేవలం ఐదు నెలల్లో రూ.14.5 కోట్ల నుంచి రూ.330 కోట్లకు పెరిగాయంటూ ట్వీట్ చేశారట. నగ్మా ట్వీట్ బట్టి లోకేష్‌ ఆస్తుల అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. వేల మంది నెటిజన్లు ఈ వార్తను తెగ చూసేస్తున్నారట. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గవర్నర్ నరసింహన్‌కు కేసీఆర్ రూ.50 కోట్ల గిఫ్ట్...! ఏంటది?