Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మారకుంటే మనుగడ లేదు... వచ్చే నెలలో ముహుర్తం : దేవినేని నెహ్రూ

ప్రస్తుతం మారకుంటే తమకు మనుగడ లేదని, అందువల్ల వచ్చే రెండోవారంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ వెల్లడించారు. దేవినేని నెహ్రూతో పాటు ఆయన తనయుడు దేవినేని అవినాష

Advertiesment
మారకుంటే మనుగడ లేదు... వచ్చే నెలలో ముహుర్తం : దేవినేని నెహ్రూ
, మంగళవారం, 30 ఆగస్టు 2016 (11:22 IST)
ప్రస్తుతం మారకుంటే తమకు మనుగడ లేదని, అందువల్ల వచ్చే రెండోవారంలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నేత దేవినేని నెహ్రూ వెల్లడించారు. దేవినేని నెహ్రూతో పాటు ఆయన తనయుడు దేవినేని అవినాష్‌లు కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నెహ్రూ, అవినాష్‌లు ప్రత్యేకంగా సమావేశమై తమ రాజకీయ భవిష్యత్‌పై చర్చించారు. 
 
అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ సెప్టెంబర్ రెండోవారంలో పార్టీలో అధికారికంగా చేరనున్నట్టు ప్రకటించారు. మరో పది రోజుల్లో టీడీపీలో చేరుతామని చంద్రబాబుకు స్పష్టం చేసిన దేవినేని, రాష్ట్రాభివృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు వెల్లడించారు. 
 
చంద్రబాబు అభివృద్ధి కార్యక్రమాలు తనను ఆకట్టుకున్నాయని, రాష్ట్రం కోసం ఆయన పడుతున్న కష్టానికి తనవంతు తోడ్పాటును అందిస్తానని తెలిపారు. తన అనుయాయులు, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీని వీడాలన్న నిర్ణయానికి వచ్చినట్టు దేవినేని పేర్కొన్నారు. దేవినేనిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు ఏపీ టీడీపీ శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేసేది మేస్త్రీ పని... ఇంట్లో కిలోన్నర బంగారం.. రూ.1.25 కోట్లు స్వాధీనం.. ఎక్కడ?