Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ముగిసిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు

ముగిసిన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు
, శనివారం, 26 సెప్టెంబరు 2020 (19:09 IST)
సెప్టెంబర్ 20, 2020న ప్రారంభమైన గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు-2020 ఈరోజుతో  విజయవంతంగా ముగిసాయి.  మొత్తం 13 శాఖల్లో  ఉన్న ఖాళీ పోస్టులకు ఏడు రోజుల పాటు నిరంతరాయంగా 14 పరీక్షలను నిర్వహించారు. 

ఈ పరీక్షలకు గానూ మొత్తం 4,920 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.  మొత్తం 10, 57, 355 హాల్ టికెట్లను జారీ చేయగా, వెబ్ సైట్ నుంచి 9,51, 016 హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్నారు. కాగా 72.73 శాతం అంటే 7,69,034 మంది పరీక్షలు రాశారు. మొత్తం 922 కోవిడ్ అనుమానిత అభ్యర్ధులు పరీక్షలకు హాజరయ్యారు.  

ఏడవ రోజు అనగా చివరి రోజైన  26-9-2020 ఉదయం కేటగిరీ-III  విలేజ్ ఫిషరీస్ ఉద్యోగానికి  16 పరీక్షా కేంద్రాల్లో 2091 (65.45%) మంది అభ్యర్ధులు హాజరయ్యారు. దరఖాస్తు  చేసుకున్న అభ్యర్ధులు 3,195 కాగా, 1104 (34.55%) మంది గైర్హాజరు అయ్యారు. కోవిడ్ పాజిటివ్, కోవిడ్ అనుమానిత లక్షణాలున్న విద్యార్ధుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన  ఐసోలేషన్ గదిలో ఇద్దరు  (2)  కోవిడ్ అనుమానిత అభ్యర్ధులు పరీక్ష రాశారు. 

అలాగే మధ్యాహ్నం జరిగిన  కేటగిరీ-III  యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్  ఉద్యోగ పరీక్షకు  13 కేంద్రాల్లో 2021 (91.28%) అభ్యర్ధులు హాజరయ్యారు. మొత్తం 2,214 మంది అభ్యర్ధులకు హాల్ టికెట్లు జారీ చేయగా 193 (8.72%) మంది అభ్యర్ధులు పరీక్షకు హాజరు కాలేదు. 
 
నిన్నటి వరకు (25-9-2020) జరిగిన పరీక్షలకు సంబంధించి ఒఎంఆర్ సమాధాన పత్రాలన్ని నాగార్జున యునివర్సిటీ స్కానింగ్ సెంటర్ కు చేరుకున్నాయి. స్కానింగ్ ప్రక్రియ మొత్తం  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేది,  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం. గిరిజా శంకర్ పర్యవేక్షణలో జరుగుతోంది. ఇప్పటి వరకు 7,00,184 ఒఎంఆర్  సమాధాన పత్రాల స్కానింగ్ పూర్తయ్యింది. 

గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు-2020కు సంబంధించి, పూర్తయిన 14 పరీక్షల ప్రిలిమినరి కీ ని గ్రామసచివాలయం వెబ్ సైట్ లో 26-9-2020 రాత్రి నుంచి అందుబాటులో ఉంటుంది. ప్రతి ఒక్క  పరీక్షకు సంబంధించి నాలుగు రకాల టెస్ట్ బుక్ లెట్ సిరీస్ కోడ్ కీ లను అభ్యర్ధుల సమాచారం కోసం వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచాం.

ఏమైనా అభ్యంతరాలు  ఉంటే అభ్యర్ధులు సెప్టెంబర్ 26 –9- 2020 నుంచి  29-9-2020  వరకు వెబ్ సైట్ లో నమోదు చేసుకోవచ్చు. అందిన అభ్యంతరాలను నిపుణులు పరిశీలించి, తుది కీ ని సాధ్యమైనంత త్వరగా విడుదల చేస్తారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

28న 'వైయస్‌ఆర్‌ జలకళ' పథకం ప్రారంభం