Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నడుములు విరిగితే ఆస్పత్రికి వెళ్లు - ఫ్రీగా వైద్యం చేయిస్తాను... ప్రయాణికుడితో మంత్రి కొట్టు వెటకారం

Advertiesment
kottu sathyanarayana
, బుధవారం, 13 డిశెంబరు 2023 (09:18 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్నాయి. అధ్వాన్నపు రోడ్లపై ప్రతి రోజూ అనేక వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. అనేక మంది చనిపోతున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానిక రోడ్లను బాగు చేయించాలన్న కనీస ఆలోచన కూడా రావడం లేదు. పైగా, ప్రజలతో రాష్ట్ర మంత్రులు మొదలుకుని వైకాపా నేతలు వరకు వెటకారంగా మాట్లాడుతున్నారు. తాజాగా రాష్ట్ర మంత్రి కొట్టు సత్యనారాయణతో ఓ ప్రయాణికుడు రోడ్ల దుస్థితిపై జరిపిన మొబైల్ సంభాషణ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రోడ్డేయించండి సారూ.. నడుములు పోతున్నాయి అన్నందుకు ప్రయాణికుడితో.. ఏం ఫర్లేదులో.. ఆస్పత్రిలో ఫ్రీగా వైద్యం చేయిస్తాను అని వెటకారంగా మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ప్రయాణికుడు, మంత్రి కొట్టుకు మధ్య జరిగిన సంభాషణను పరిశీలిస్తే, 
 
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి తణుకు వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. ఆ రోడ్డుపై బస్సులో ప్రయా ణించిన ప్రయాణీకుడు మంత్రికి ఫోన్ చేశారు.
 
ప్రయాణికుడు : హలో... కొట్టు సత్యనారాయణ గారూ. 
మంత్రి : ఎవరు మీరు?
ప్రయాణీకుడు : నా పేరూ సత్యనారాయణే సర్.. తణుకు నుంచి మాట్లాడుతున్నాను.
మంత్రి : ఆ.. ఏమిటో చెప్పు?
ప్రయాణికుడు : సార్. పొద్దున్న మేము హైదరాబాద్ నుంచి తణుకు వస్తుంటే.. తాడేపల్లిగూడెంలో రోడ్లు ఏంటి సర్ అలా ఉన్నాయి? ఒళ్లు హూనమైపోయింది.
మంత్రి : వెరీగుడ్. పోనీలే...
ప్రయాణికుడు : అలాకాదు.. మీకు మంత్రి పదవి ఉంది... రోడ్లు వేయించొచ్చు కదండీ?
మంత్రి : అలాగే... చెప్పావు కదమ్మా!
ప్రయాణికుడు : కొద్దిగా చూడండి సర్. నడుము పట్టేసిందండి. అందు కోసమే మీకు ఫోన్ చేశాను.
మంత్రి : ఆసుపత్రికి వెళ్లు... ఫ్రీగా వైద్యం చేయిస్తాను. 
ప్రయాణికుడు : అంటే రోడ్డు వేయరా సారూ?
మంత్రి : ఎందుకొచ్చిందయ్యా... ఎక్కడో తణకు వచ్చావు... ఏదో చిన్నది. అయితే నాకు ఫోన్ చేయాలా....
ప్రయాణికుడు : ఆ రోడ్డు నుంచే కదండీ వచ్చింది బస్సు.
ఇంతలో మంత్రి ఫోన్ కట్ చేశారు. ఈ సంభాషణ రాష్ట్రంలోని రహదా రుల దుస్థితికి అద్దంపట్టింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్ట్రేలియాలో విద్యాభ్యాసం చేయాలనివుందా.. అయితే, ఆంగ్ల భాషపై పట్టుండాల్సిందే...