Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రజలు బ్రహ్మరథం పట్టారు.. మంచి పాలన అందించివుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు...

Advertiesment
kotamreddy
, గురువారం, 21 సెప్టెంబరు 2023 (12:31 IST)
గత ఎన్నికల్లో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని, అందుకే 151 సీట్లతో అధికారంలోకి వచ్చారని వైకాపా రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం జగన్ .. వైఎస్ రాజేశేఖర్ రెడ్డి తరహాలో మంచి పాలన అందించివుంటే ఈ దుస్థితి వచ్చేది కాదని ఆయన అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుతో సీఎం జగన్‌లో ఆందోళన కనిపిస్తుదని ఆయన అన్నారు. అధికార బలంతో సభలో తమతో పాటు విపక్ష సభ్యులను అడ్డుకోవడం ప్రభుత్వం వల్ల కాదన్నారు. రెట్టించిన సమరోత్సాహంతో ప్రభుత్వ వైఖరిని ఎఁడగడుతామని కోటంరెడ్డి ప్రకటింటారు. 
 
టీడీపీ చంద్రబాబు సభలకు, యువనేత నారా లోకేశ్ పాదయాత్రకు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుందని, దీన్ని ముఖ్యమంత్రి జీర్ణించుకోలేక ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని, మంచి పాలన అందించివుంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు అని ఎద్దేవా చేశారు. కాగా, అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిర్వహించిన పాదయాత్రలో కోటంరెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ రెబెల్ ఎమ్మెల్యేజగన్ గురించి కీలకవ వ్యాఖ్యలు చేశారు. 
 
మీసం మెలేసిన బాలకృష్ణ... ఫస్ట్ వార్నింగ్ ఇచ్చిన స్పీకర్ 
 
హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ వేదికగా మీసం మెలేశారు. సోమవారం నుంచి ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. సభలు ప్రారంభమైన వెంటనే ఉభయ సభల్లో టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానానలు స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి ఛైర్మన్లు తిరస్కరించారు. దీంతో టీడీపీ, వైకాపా సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలోవాగ్వాదం జరిగింది. 
 
అసెంబ్లీ ప్రారంభంకాగానే టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. చంద్రబాబు అరెస్టుపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. అయితే ఈ తీర్మానాన్ని మండలి ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో టీడీపీ సభ్యులు పోడియంలోకి దూసుకెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో, సభను మండలి ఛైర్మన్ వాయిదా వేశారు.
 
చంద్రబాబు అరెస్టు అక్రమంటూ టీడీపీ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి, ఆయన మైక్ లాక్కొనే ప్రయత్నం చేసారు. ఈ సందర్భంగా టీడీపీ సభ్యులపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరు స్పీకర్‌పైనే దాడి చేస్తున్నట్టుగా ఉందని మంత్రి ఆరోపించారు. బల్లలు కొట్టాల్సింది ఇక్కడ కాదని న్యాయస్థానాల్లో అని ఎద్దేవా చేశారు.
 
దీంతో అంబటిపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైర్ అయ్యారు. అంబటిపై మీసం మెలేయడంతో పాటు... 'దమ్ముంటే రా అంబటీ' అంటూ సవాల్ విసిరారు. దీనిపై అంబటి స్పందిస్తూ... మీసాలు మెలేయడాలు సినిమాల్లో చేసుకోవాలని సెటైర్ వేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. దీంతో, సభను స్పీకర్ తమ్మినేని 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మీసం మెలేసిన బాలకృష్ణ... ఫస్ట్ వార్నింగ్ ఇచ్చిన స్పీకర్