Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైఎస్సార్ రైతు భరోసా.. పీఎం కిసాన్ విడుదల

Advertiesment
ys jagan
, సోమవారం, 16 మే 2022 (11:41 IST)
ఏపీ సర్కారు వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ విడుదల చేయనుంది. ఇందులో భాగంగానే నేడు… రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్.

ఈ కార్యక్రమంలో భాగంగానే.. నేడు ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు జగన్‌. ఏలూరు జిల్లా గణపవరం మండలం గణపవరంలో వైయస్సార్‌ రైతు భరోసా-పీఎం కిసాన్‌ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు.
 
మొదటి విడతగా రూ. 5,500లను రైతుల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి, ఏలూరు జిల్లా గణపవరం నుంచి వర్చువల్‌గా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
 
ప్రతి ఏటా 3 విడతల్లో రూ.13,500ల రైతు భరోసా సాయం చేస్తోంది. ఈ నెల 31న కేంద్రం ఇవ్వనున్న పీఎం కిసాన్‌ నిధులు 2వేలు… మొత్తంగా నెలాఖరు నాటికి 50.10 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.7,500 చొప్పున దాదాపు రూ.3,758 కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నడిచింది నేను.. నడిపించింది మీరే - బండి సంజయ్‌కు ప్రధాని మోడీ