Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆళ్ళగడ్డ యువకుడిని ప్రేమించిన కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష... ప్రియుడితో మాట్లాడించవద్దన్న అధికారులు!

Advertiesment
CM KCR's adopted daughter
, సోమవారం, 2 మే 2016 (11:31 IST)
హైదరాబాద్‌లో సవతి తల్లి, తండ్రిల వికృత చేష్టల కారణంగా గృహనిర్బంధంలో చిక్కుని ప్రాణాపాయ స్థితిలో బాహ్య ప్రపంచాన్ని చూసిన యువతి ప్రత్యూష. సవతి తల్లి పెట్టిన వాతలు, కొట్టిన గాయాలతో ఆ యువతిని హైదరాబాద్ స్త్రీశిశుసంక్షేమ అధికారులు రక్షించి, ప్రభుత్వ సంరక్షణా గృహానికి తరలించిన విషయం తెల్సిందే. 
 
ఆ తర్వాత ఈ యువతిని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ముందుకు వచ్చి దత్తత తీసుకున్నారు. ఒక రోజు తన నివాసంలో పెట్టుకుని, తనతోపాటు.. భోజనం కూడా చేయించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే మహిళా, శిశు సంక్షేమ శాఖ హాస్టల్‌లో ఉంచి చదవిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో తాను ఆళ్లగడ్డకు చెందిన యువకుడిని ప్రేమించానని, అతనితో తన పెళ్లి జరిపించాలని ప్రత్యూష కోరింది.
 
అయితే, ప్రత్యూష బాగోగులు స్వయంగా కేసీఆర్ పర్యవేక్షిస్తున్నందున, ఈ విషయంలో ఆయన అభిప్రాయం తీసుకున్న తర్వాతనే ముందుకు వెళ్లాలని అధికారులు భావిస్తున్నారు. అప్పటివరకు ప్రత్యూషను ప్రియుడితో కలవనీయవద్దని కేసీఆర్ కార్యాలయం అధికారుల నుంచి మహిళా, శిశు సంక్షేమ విభాగం అధికారులకు సమాచారం చేరవేరశారు. సోమవారం కరీంనగర్ పర్యటన అనంతరం, ప్రత్యూష ప్రేమ విషయమై కేసీఆర్ ఓ నిర్ణయానికి రావచ్చని అధికారులు చెబుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిత్తూరు జిల్లా తవణంపల్లెలో యువతి దారుణ హత్య