Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గోదారి గట్టు మీద సినిమా చెట్టు... మళ్లీ చిగురిస్తోంది..

Advertiesment
Cinema Tree

సెల్వి

, శుక్రవారం, 11 అక్టోబరు 2024 (10:24 IST)
గోదారి గట్టు మీద ఉన్న సినిమా చెట్టు మళ్లీ చిగురిస్తోంది. తెలుగు సినిమా ప్రేక్షకులను అలరించిన 150 ఏళ్ల సినిమా చెట్టు మళ్లీ చిగురుస్తుందని ఆశతో కుమారదేవం వాసులు ఎంతగానో మురిసిపోతున్నారు. 
 
గోదావరి వరదల కారణంగా గట్టు కోతకు గురికావడంతో ఈ చెట్టు ఇటీవల కూలిపోయింది. ఈ ఘటన కేవలం కుమారదేవం ప్రజలకు మాత్రమే కాదు, తెలుగు సినీ ప్రముఖులను సైతం దిగ్భాంతికి గురి చేసింది. 
 
ఎందుకంటే గోదావరితో అనుభంధం ఉన్న ప్రతి ఒక్కరికి సినిమా చెట్టుతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అనుభంధం పెనవేసుకుంది. అందుకే ఇది కేవలం ఒక నిద్ర గన్నేరు చెట్టుగా మాత్రమే కాదు సినిమా చెట్టుగా అవతరించింది. 
 
ఈ సినిమా చెట్టు బ్రతికించడానికి చేస్తున్న ప్రయోగాలలో రాజమహేంద్రవరం రోటరీ సభ్యుల కృషిని మనం కొనియాడాలి. రోటరీ సభ్యులు చెట్టు మానులను కట్ చేసి రసాయన ప్రక్రియ ద్వారా ఈ చెట్టుకు మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు.
 
ఏ గోదారి గట్టు మీద అయితే సినిమా చెట్టు ఒరిగిపోయిందో తిరిగి అక్కడే మరో వందేళ్ల పాటు బ్రతకడానికి చిగుళ్ళను తొడుక్కుంటుంది. తరతరాలకు నీడను పంచి ఊరి జనాలతో మమేకమైన ఈ చెట్టు మళ్లీ లేలేత చిగుళ్ళతో ఊపిరి పోసుకుంటుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

15న హర్యానా రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం?