పోలీసులంటే... ఫిజికల్ గా ఫిట్ గా ఉండాలి. కానీ, వాళ్లకున్న డ్యూటీల ఒత్తిడిలో చాలా మంది పోలీసులు తమ ఫిజికల్ ఫిట్నెస్‌ని కోల్పోతున్నారు. నిత్యం కేసులు, బందోబస్తులు, రాజకీయ ఒత్తిడులు అన్నీ కలిసి, వాళ్ళపై వాళ్లు శ్రద్ధ పెట్టే పరిస్థితులు లేకుండా చేస్తున్నాయి. కానీ, గుంటూరు పోలీస్ సర్కిల్ ఇనస్పెక్టర్ నరేష్. ఆయన డ్యూటీ ఎంతో నిబద్ధతతో చేస్తాడు.
ఆయన స్టేషన్ పరిధిలోని ప్రజలు సెల్యూట్ పోలీస్ అనేలా... ఆ స్టేషనుకు వెళితే న్యాయం జరుగుతుంది అనే భరోసా కల్పిస్తాడు... తప్పు చేసినవాడు మరోసారి తప్పు చేయాలన్న ఆలోచన రాకుండా చేసే సత్తా ఆ స్టేషన్ పోలీసులది.
అసాంఘిక కార్యకలాపాల శక్తులు అక్కడ ఏమైనా చేయాలంటే, ఒకటికి పది సార్లు ఆలోచిస్తారు అంటే అక్కడ అధికారులు ఎంత నిబద్ధతతో ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. దీనికి ఆ సిఐ రెగ్యులర్ గా చేసేది... ఉదయం కసరత్తులు, నిత్యం సి.ఐ. నరేష్ ఇలా జిమ్నాస్టిక్స్ చేస్తాడు. తన బాడీ ఫిట్ అయ్యేలా వర్క్ అవుట్ చేస్తాడు. ఆయన చేసే ఫీట్స్ చూసి, చాలా మంది ప్రశంసిస్తారు. పోలీస్ అంటే ఇలా ఉండాలని అభినందిస్తారు.