Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్పత్రిలో కుమార్తె.. కోర్కె తీర్చాలంటూ భర్త పైశాచికత్వం.. భార్యపై లైంగికదాడి...

Advertiesment
Chittoor
, మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (12:22 IST)
ఓ భర్త కామంతో అత్యంత పైశాచికత్వంగా ప్రవర్తించాడు. అనారోగ్యంబారినపడిన కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె వద్ద ఉన్న భార్యను కోర్కె తీర్చాలంటూ పైశాచికంగా ప్రవర్తించాడు. ఆస్పత్రిలోనే లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ దారుణం చిత్తూరు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చిత్తూరు జిల్లాలోని ఇరువారం దళితవాడకు చెందిన పద్మ అనే మహిళకు యాదమరి మండలం పాపిశెట్టిపల్లెకు చెందిన కూలి పనిచేసే నంద (37) అనే వ్యక్తితో 18 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వీరిలో పెద్దమ్మాయికి తీవ్రమైన జ్వరం రావడంతో ఆమెను గత మూడు రోజులుగా చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 
 
అప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలతో కలిసి పద్మ ఆసుపత్రిలోనే ఉంటోంది. అయితే, తాగుబోతు అయిన నంద.. ఆదివారం పీకల వరకు మద్యం సేవించి ఆస్పత్రికి వచ్చి... ఆస్పత్రిలోనే కోర్కె తీర్చమని బలవంతం చేశాడు. కుమార్తె అనారోగ్యంతో ఆస్పత్రిలో బాధపడుతుంటే ఇదేంపనంటూ ఆమె భర్తపై కోపగించుకుంది. ఇదే విషయంపై వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది తాగుబోతు నందను బయటకు పంపించేశాడు. 
 
అయితే రాత్రి 11 గంటల సమయంలో మళ్లీ ఆసుపత్రికి వచ్చిన నంద, తన భార్యను మభ్యపెట్టి పిల్లల వార్డు మిద్దెపైకి తీసుకెళ్లాడు. తన కోర్కెను తీర్చాలంటూ బలవంతం చేయగా ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహానికిగురైన నంద విచక్షణ కోల్పోయి భార్యను తీవ్రంగా కొట్టాడు. అనంతరం ఆమెపై లైంగిక దాడి చేసి చీరతో గొంతు నులిమి హత్య చేయడానికి ప్రయత్నించాడు. 
 
తీవ్ర రక్తస్రావం మధ్య వివస్త్రగాపడున్న పద్మను సోమవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆమె రెండో కుమార్తె గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చింది. అనంతరం పద్మను అత్యవసర విభాగానికి తరలించి ప్రాథమిక చికిత్స అందించినా కోలుకోకపోవడంతో ఆసుపత్రిలోని ఐసీయూకు తరలించారు. 
 
ప్రస్తుతం కోమాలో ఉన్న పద్మకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. లైంగిక దాడిలో అంతర్గత అవయవాలు సైతం తీవ్రంగా దెబ్బతినడంతో మరో 24 గంటలు గడిస్తే తప్ప ఆమె ఆరోగ్య పరిస్థితిని ఏమీ చెప్పలేమని వైద్యులు వెల్లడించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈస్టర్ సండే పేలుళ్లు : 310కి చేరిన మృతులు... 40 మంది అనుమానితుల అరెస్టు