Publish Date: Fri, 15 Mar 2019 (13:33 IST)
Updated Date: Fri, 15 Mar 2019 (14:18 IST)
బాలికలపై అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. తండ్రి, తాత వయసు గలవారే ఇలా చేస్తున్నారు. ఓ గ్రామంలో వరుసకు మనవరాలయ్యే చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు కామాంధుడు. వివరాల్లోకి వెళ్తే.. బాలికకు మానసిక స్థితి సరిగా లేదు.. దీన్ని ఆసరాగా తీసుకున్న ముసలి తాత ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
ఎం. ఉప్పలూరు గ్రామానికి చెందిన జింకల పుల్లయ్య.. మనవరాలి వరుసయ్యే బాలికతో కలిసి ఆరునెలల క్రితం గొర్రెలు మేపుకునేందుకు పొలానికి వెళ్లాడు. అప్పుడు అక్కడి ప్రాంతంలో ఎవ్వరు కనిపించని చోటుకు ఆమెకు తీసుకెళ్లి.. అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు మతిస్థిమితం లేకపోవడంతో అప్పట్లో ఈ విషయం బయటకు రాలేదు. దాంతో పుల్లయ్య.. ఎవ్వరికి దీని గురించి తెలియలేదని ప్రతిరోజూ ఇలానే చేస్తున్నాడు.
బాలికను గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను రెండు రోజుల క్రితం ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు ఆమెను పరీక్షించి బాలిక ఆరు నెలల గర్భవతిగా ఉందని తేల్చారు. ఈ విషయం విన్న చిన్నారి బంధువులు పుల్లయ్యను నిలదీయడంతో అత్యాచారానికి పాల్పిడినట్లు ఒప్పుకున్నాడు. ఇక బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పుల్లయ్యను అరెస్ట్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
webdunia
Publish Date: Fri, 15 Mar 2019 (13:33 IST)
Updated Date: Fri, 15 Mar 2019 (14:18 IST)