Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గవర్నర్‌ను కలిసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా

Advertiesment
Meena
, శుక్రవారం, 20 మే 2022 (16:03 IST)
ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన ఓటు హక్కును అందరూ వినియోగించుకునేలా ఎన్నికల వ్యవస్థలు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం రాజ్ భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మర్యాద పూర్వకంగా కలిసారు.

 
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం దేశానికి పటిష్టమైన ఎన్నికల వ్యవస్థను కల్పించిందని, దానిని అమలు చేయవలసిన బాధ్యత ఆయా రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులపైనే ఉందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు ఎన్నికల సంఘం చక్కదిద్దవలసిన వ్యవహారాలపై దృష్టి సారించాలని, దానిలో ఓటర్ల అవగాహన కార్యక్రమాలు కీలకమైనవని బిశ్వభూషణ్ అన్నారు.

 
రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరుకు సంబంధించిన వివరాలను మీనా, గవర్నర్‌కు వివరించారు. కార్యక్రమంలో గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా తదితరులు ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీపీసీసీ అధ్యక్షుడిగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి?