Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెవిరెడ్డి సేవానిరతి, సొంత నిధులతో 25 వేల ఎన్ -95 మాస్కులు ఉచితంగా పంపిణీ

చెవిరెడ్డి సేవానిరతి, సొంత నిధులతో 25 వేల ఎన్ -95 మాస్కులు ఉచితంగా పంపిణీ
, శుక్రవారం, 7 మే 2021 (19:17 IST)
తిరుపతి: యుద్ద సైనికుల్లా పనిచేస్తున్న కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు 25 వేల ఎన్ -95 మాస్కులు పంపిణీ చేస్తూ ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోమారు తన సేవా నిరతిని చాటుకున్నారు. ఇటీవల సొంత నియోజకవర్గం చద్రగిరిలో 16 లక్షల సర్జికల్ మాస్కులు పంపిణీ చేసి తన సేవాతత్వానికి ఎవరూ సాటిరారని నిరూపించారు.
 
కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా..  క్షేత్ర స్థాయిలో తమవంతు కర్తవ్యాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తున్న పాత్రికేయులు, పోలీసులు, శానిటరీ వర్కర్లు, పంచాయతీ, వైద్య సిబ్బంది సేవలు అనన్యమని చెవిరెడ్డి కొనియాడారు. శుక్రవారం తుడా కార్యాలయంలో ఎన్ -95 మాస్కుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

మాస్క్ ఆవశ్యకతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. ప్రపంచమంతా స్పష్టం చేస్తోంది.. కరోనా నుంచి రక్షణ కవచంగా మాస్క్ పనిచేస్తోందని అన్నారు. ఎండనక, వాననక విధులు నిర్వర్తిస్తున్న ఫ్రంట్ లైన్ వారియర్స్‌కు కరోనా నుంచి రక్షణగా ఎన్ - 95 మాస్కులు ఉపయోగ పడతాయన్నారు. నా సొంత నిధులతో మాస్కులు అందించడం నా బాధ్యతగా భావిస్తున్నాను.

ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తూ కరోనా కట్టడిలో ప్రజలను చైతన్య పరుస్తూ  పాత్రికేయులు తమ వంతు బాధ్యతగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అలాగే పోలీస్ వ్యవస్థ కూడా ప్రజా రక్షణలో కీలకంగా వ్యవహరిస్తోందని కొనియాడారు. కరోనా భయాందోళనలు ఉన్న క్రమంలో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ వైద్య సిబ్బంది స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని కీర్తించారు.

కరోనా బాధితులు ఉన్న ప్రాంతాల్లోనే కాకుండా పారిశుద్ధ్య పనుల్లో పారిశుద్ధ్య కార్మికులు తమ వంతు ప్రధాన భూమిక పోషిస్తున్నారు.  నిరంతరంగా ప్రజలతో మమేకమై కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ, ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న వార్డు వాలంటీర్లు, సచివాలయం సిబ్బంది, ఏఎన్ఎంలు  సేవలను గుర్తుచేశారు. ఎవరికీ వారు వారివారి విధుల్లో కీలకంగా వ్యవహరిస్తూ కరోనా నియంత్రణకు, ప్రజల ప్రాణ రక్షణలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారని తెలియజేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

9 నిమిషాల్లో 12 కిలోమీటర్లు ప్రయాణం, రోగి కోసం గ్రీన్ కారిడార్