Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సర్వర్ మైనింగ్‌తో సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు షాక్.. రూ.3 కోట్లు మింగేసిన ఛీటర్.. అరెస్ట్!

డేటా ఎంట్రీ ప్రాజెక్టులకు సరికొత్త పేరు పెట్టాడు. సర్వర్ మైనింగ్ పేరును జోడించి భారీ ఆదాయం అందుకోండని ప్రకటించాడు. ఈ ప్రకటనలు నమ్మి భా మొత్తాన్ని వెచ్చించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు చివరకి మోసపోయారు. అయి

Advertiesment
cheater arrested for server mining fraud in cyberabad
, గురువారం, 28 జులై 2016 (15:30 IST)
డేటా ఎంట్రీ ప్రాజెక్టులకు సరికొత్త పేరు పెట్టాడు. సర్వర్ మైనింగ్ పేరును జోడించి భారీ ఆదాయం అందుకోండని ప్రకటించాడు. ఈ ప్రకటనలు నమ్మి భా మొత్తాన్ని వెచ్చించిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు చివరకి మోసపోయారు. అయితే ఆ ఛీటర్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సర్వర్ మైనింగ్ పేరుతో చనిపోయిన వ్యక్తి మీద ఆన్‌లైన్ అకౌంట్ నిర్వహిస్తూ.. రూ.3 కోట్ల వరకు మింగేశాడు. 
 
వివరాల్లోకి వెళితే.. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ WWW.3GCOIN.EU వెబ్‌సైట్‌లో సర్వర్ మైనింగ్ గురించి చూశారు. డేటాను గిగా బైట్స్ కింద మార్చితే భారీ మొత్తం వస్తుందన్నాడు. అంతే ఆ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఏకంగా రూ.18 లక్షలు చెల్లించి కష్టాలను కొనితెచ్చుకున్నాడు. ఎంతకీ తాను కట్టిన సొమ్ముకు ఆదాయం రాకపోవడంతో పలు సార్లు వెబ్‌సైట్‌లో ఉన్న చిరునామాలో సంప్రదింపులు చేసినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సర్వర్ మైనింగ్ పేరిట మోసాలకు పాల్పడిన బెంగళూరుకు చెందిన జగదీష్‌ను బుధవారం అరెస్టు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన జగదీష్ WWW.3GCOIN.EU పేరుతో వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. ఈ సంస్థ పేరిట సర్వర్ మైనింగ్ డేటా ప్రాజెక్ట్‌లను తీసుకుంటే రెండు సంవత్సరాలలో మీరు పెట్టిన పెట్టుబడికి 180 శాతం అధిక ఆదాయం వస్తుందని బుకాయించాడు. దీనికోసం కంపెనీ ఇచ్చే సర్వర్ మైనింగ్ డేటాను ఆల్గోరిథమ్ ప్రక్రియలో క్రిప్టో గ్రాఫీ, బార్‌కోడ్స్‌లను కిలో బైట్స్, మెగా బైట్స్, గిగా బైట్స్‌ల కింద మార్చి డేటాను రూపొందించాలి. 
 
ఇలా ఒక గిగా బైట్ డేటాను తయారు చేస్తే ఒక గ్రాము క్రిప్లో కరెన్సీని ఇస్తామని వివరించారు. ఈ క్రిప్టో కరెన్సీ విలువ 4 యూరోలు ఉంటుంది. దీనికోసం WWW.3GCOIN.GOLD. వెబ్ సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రిజిస్టర్ చేసుకునే వారి వద్ద భారీ మొత్తాన్ని కాజేసి చివరికి జగదీష్ పోలీసులకు చిక్కాడు. దేశవ్యాప్తంగా రూ.3 కోట్ల వరకు కొట్టేశాడని పోలీసులు చెప్తున్నారు. జగదీష్ చాలామందిని మోసం చేశాడని పోలీసులు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలుగుదేశం పార్టీకి దూరంగా చిత్తూరు ఎమ్మెల్యే..! కారణమేంటి..!