బెజవాడ దుర్గమ్మను నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ సాక్షిగా చంద్రబాబు సతీమణి భావోద్వేగానికి గురయ్యారు. ఆదివారం టీడీపీ అధినేత చంద్రబాబు, భువనేశ్వరిలవివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని.. రెండు రోజుల ముందే ఆయన అరెస్ట్ అయ్యారు.
దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం నారా భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. బాధలు చెప్పుకునేందుకే దుర్గమ్మను దర్శించుకున్నట్లు తెలిపారు.
తన భర్తను కాపాడమని దుర్గమ్మను కోరుకున్నట్లు చెప్పారు. తన భర్త ప్రజల కోసమే పోరాడుతున్నారని.. ఈ పోరాటం విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. చంద్రబాబు పోరాటానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని భువనేశ్వరి విజ్ఞప్తి చేశారు.
చంద్రబాబు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం శ్రమిస్తున్నారన్నారు. సీఎం జగన్ మాత్రం ఏపీని వదిలేసి విదేశాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
మరోవైపు చంద్రబాబును ప్రస్తుతం సీఐడీ పోలీసులు విజయవాడకు తరలిస్తున్నారు. సాయంత్రం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు బెయిల్ కోసం టీడీపీ నేతలు పిటిషన్ వేశారు.