Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిందూ దేవుళ్ళను వేధించిన చంద్రబాబు: దేవదాయ శాఖ మంత్రి

హిందూ దేవుళ్ళను వేధించిన చంద్రబాబు: దేవదాయ శాఖ మంత్రి
, శనివారం, 14 సెప్టెంబరు 2019 (17:49 IST)
చంద్రబాబు నాయుడు ప్రజలతో పాటు హిందూ దేవుళ్ళని వేధించారని, టిడిపి హయాంలో హిందూ దేవుళ్ళకు నిలువ నీడలేకుండా పుష్కరాలు, రహదారుల విస్తరణ పేరుతో పలు హిందూ దేవాలయాలను కూల్చిన ఘనత చంద్రబాబు నాయుడుదే అని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

శనివారం సెంట్రల్ నియోజక వర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు దేవదాయ, ఇతర అధికారులతో కలిసి ప్రకాశం బ్యారేజ్ వద్ద గల శనీశ్వర ఆలయ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రజలు, హిందువులను, ఇతర మతస్తుల ను, బాధ పెట్టే విదంగా వారి మనోబావాలు దెబ్బ తీసే విధంగా టిడిపి పాలన కొనసాగిందన్నారు.

పుష్కరాల పేరుతో టిడిపి ప్రభుత్వం విజయవాడ నగరంలో అనేక దేవాలయాలను కూల్చటం జరిగిందని ఆ సమయం లో హిందూ సేవా సంస్థలతో కలిసి ఆలయాల నిర్మాణం కోసం పోరాడిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేశారు. కూల్చిన ఆలయాలను అదే చోట లేదా ఇతర ప్రాంతాలలో నిర్మించేందుకు వైయస్ఆర్ సిపి ప్రభుత్వం నడుం బిగించిందన్నారు.

హిందూ ధర్మాన్ని వైయస్ఆర్ సిపి ప్రభుత్వమే కాపాడుతుందన్నారు. హిందూ మరియు ఇతర మతస్తుల మనోబావాలకు అనుగుణంగా వారికి అండగా వైయస్ ఆర్ సిపి ప్రభుత్వం ఉంటుందన్నారు.

జగన్ మోహన్ రెడ్డి సిఎం అయిన వెంటనే హిందూ ధర్మ పరిరక్షణకు ఆలయాల పునః నిర్మాణానికి ఆదేశాలు ఇవ్వటం జరిగిందని, అందులో బాగంగా శనీశ్వర ఆలయం వద్ద తొలగించిన సీతమ్మ వారి పాదాలను త్వరలో అక్కడ సీతమ్మ వారి పాదాల నిర్మాణంతో నగరం లోని ఆలయాల పునః నిర్మాణం ప్రారంభ మవుతుందన్నరు.
 
స్టేడియంకు 6 కోట్లు విడుదల
టిడిపి ప్రభుత్వ పాలనలో పశ్చిమ నియోజక వర్గ అభివృద్ది పైన పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

శనివారం నియోజక వర్గ పర్యటనలో బాగంగా 29 వ డివిజన్ లేబర్ కాలనీలో మంత్రి పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఆయన మాట్లాడుతూ.. టిడిపి ప్రభుత్వం ఐదు సంవత్సరాల లో స్టేడియం నిర్మాణం కోసం శంకుస్థాపన పై మరో శంకుస్థాపన చెయ్యటం తప్ప నిర్మాణ పనులు చేపట్టలేదన్నారు.

విజయవాడ నగరంలో మున్సిపల్ స్టేడియం తప్ప క్రీడల కోసం మరో స్టేడియం లేదని గాంధీ జి మున్సిపల్ స్కూల్ గ్రౌండ్ పలు నిర్మాణాలతో కుచించుకు పోతుందన్నారు. ఈ తరుణంలో నియోజక వర్గ ప్రజల కోరిక మేరకు అరు కోట్ల రూ లతో స్టేడియం నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.

ఇందులో మిని క్రికెట్ స్టేడియం తో పాటు పలు క్రీడలకు సంబందించిన సదుపాయాలు ఎర్పాటు చెయ్యటం జరుగుతుందని అన్నారు. లేబర్ కాలనీ లో ఉన్న ఇళ్ళు మెయిన్ రోడ్ కన్న పల్లంగా ఉన్న కారణంగా వర్షపు నీరు, డ్రైన్ మురుగుతో పలు ఇబ్బందులు పడుతున్నామని వ్యాధులు సతాయిస్తున్నయని స్థానికులు మంత్రికి విన్నవించారు.

ఈ ప్రాంతంలో నూతన గృహాల నిర్మాణానికి ప్రజలు సూత్ర ప్రాయం గా అంగీకరించారని దీనితో అధికారులు ప్రభుత్వం లేదా ప్రైవేట్ బాగ స్వామ్యం తో నూతన గృహాలు నిర్మించేందుకు ఉన్నవారికి గృహాలను కేటాయించటం తో పాటు చుట్టు ప్రక్కల గృహాలు లేని వారికి ఈ ప్రాంతంలో గృహాలు కేటాయించే విషయం పై సాద్యా సాద్యాలను చర్చించటం జరుగుతుందన్నారు.

త్వరలో ప్రభుత్వం ఒక నిర్ణయంతో నూతన గృహ నిర్మాణాలు పనులు చేపడుతుందని తెలిపారు. ఈ పర్యటనలో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, క్రీడల మరియు జిల్లా అధికారులు  పార్టీ నాయకులు డివిజన్ మాజీ కార్పొరేటర్ లు సంధ్యా రాణి, అప్పాజీ, మైలవరపు దుర్గారావు, కంది శ్రీనివాస రెడ్డి, కృష్ణ రెడ్డి, కోటిరెడ్డి, జిలానీ, పెద్ది రాజా రావు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మూడు నెలల్లో ఏ పనైనా వైసీపీ ప్రభుత్వం చేసిందా?.. దేవినేని