సీనియర్ రాజకీయ నేత విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తన దావోస్ పర్యటన వివరాలను వెల్లడించడానికి శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, విజయసాయి రెడ్డి రాజీనామా గురించి పాత్రికేయులు లేవనెత్తిన ప్రశ్నలకు చంద్రబాబు బదులిచ్చారు. "ఎవరైనా ఒక పార్టీపై విశ్వాసం కలిగి ఉంటే, వారు అక్కడే ఉంటారు. లేకుంటే, వారు వెళ్లిపోతారు" అని అన్నారు.
అటువంటి నిర్ణయాలలో పార్టీ పరిస్థితి కీలక పాత్ర పోషిస్తుందని, ఈ రాజీనామాను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యగా అభివర్ణించారు. "వ్యక్తిగత కక్ష్యల కారణంగా వ్యవస్థలను నాశనం చేయడం ఏపీలోనే వుంటుంది.
ఈ ప్రత్యేకమైన పరిస్థితి దేశంలో మరెక్కడా కనిపించదు" అని ఏపీలోని రాజకీయ వాతావరణాన్ని విమర్శించారు. రాజకీయాల్లో పాల్గొనడానికి అర్హతలు లేని వ్యక్తులు రంగంలోకి దిగినప్పుడు, అటువంటి పరిస్థితులు అనివార్యంగా తలెత్తుతాయని చంద్రబాబు అన్నారు.